● జేసీ కార్తీక్
నెల్లూరు(అర్బన్): జిల్లాలో రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జేసీ కార్తీక్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని క్యాంప్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూలో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యుటేషన్ల లావాదేవీలు, ఫ్రీ హోల్డ్ భూ సమస్యలపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హౌస్‌హోల్డ్ సర్వే, లిట్రసీ సర్వేలు వేగంగా చేయాలని కోరారు. హౌసింగ్ శాఖలో చివరిదశలో ఉన్న నిర్మాణాలు తక్షణమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్లను ఎంపిక చేసి సంక్రాంతి నాటికి వాటిని పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పనులు పెంచాలన్నారు. పల్లెల్లో ఉన్న ఓహెచ్‌ఆర్ ట్యాంకులను శుభ్రం చేయాలని కోరారు. పాఠశాలల్లో విద్యార్థులకు అపార్‌కార్డులను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్వో ఉదయభాస్కర్, జెడ్పీ సీఈఓ విద్యారమ, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డ్వామా పీడీ గంగా భవానీ, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, డీఈఓ బాలాజీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వెంకటరమణ, పీఆర్ ఎస్‌ఈ అశోక్‌కుమార్, పరిశ్రమల శాఖ జీఎం మారుతీప్రసాద్, సమగ్రశిక్ష ఏపీసీ ఉషారాణి, మైక్రో ఇరిగేషన్ పీడీ శ్రీనివాసులు, ఉద్యాన శాఖాధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment