No Headline
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ వర్గాల ప్రజలు అనేక రకాలుగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. పలు శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని, టీడీపీ నేతలు రాజకీయ కక్షతో తమ ఉద్యోగాలు తొలగించారని న్యాయం చేయాలని, ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని విద్యార్థులు, ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగులు, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వలంటీర్లు, జనావాసాల మధ్య మద్యం దుకాణాలు తొలగించాలని సామాన్య మహిళలు ఇలా.. అనేక వర్గాలు కలెక్టరేట్ ఎదుట ప్రతి సోమవారం ధర్నాలు, ర్యాలీలతో నగరం అట్టుడుకుతోంది. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. న్యాయం జరగకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఆందోళనకరమైన ఘటనలు జరగలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాకే తమ కష్టాలు పెరిగాయని ప్రజలు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment