సీఐటీయూ బైక్ ర్యాలీ
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సోమవారం సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని శెట్టిగుంటరోడ్డులో ఉన్న సీపీఎం కార్యాలయం నుంచి పప్పులవీధి, ఆత్మకూరు బస్టాండ్, మినీబైపాస్‌రోడ్డు, ముత్తుకూరుగేటు సెంటర్, వీఆర్సీ సెంటర్, ట్రంకురోడ్డు మీదుగా ఏబీఎం కాంపౌండ్ వరకు ఈ ర్యాలీ నిర్వ హించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్, నగర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చట్టం తీసుకు రావాలని, అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల జీవితాలకు భద్రత కల్పించాలని, కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చాల ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించే ర్యాలీలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కత్తి శ్రీనివాసులు, కాయం శ్రీనివాసులు, మూలం ప్రసాద్, రాంబాబు, అశోక్, నాయకులు మస్తాన్‌బీ, సూర్యనారాయణ, అంకయ్య, చెంచులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment