No Headline
ఇంటింటా నిరంతరం కాంతులకు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా వినియోగదారులు ఇళ్లపైనే సోలార్ ప్యానల్స్‌ను అమర్చుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది.
– కలిగిరి/సీతారామపురం
రూఫ్ టాప్ ప్యానల్స్ రాయితీ వివరాలు
సామర్థ్యం విద్యుత్ ఉత్పత్తి ఖర్చు రాయితీ
1 కిలోవాట్ 120 యూనిట్లు రూ.60 వేలు రూ.30 వేలు
2 కిలోవాట్ 240 యూనిట్లు రూ.1.40 లక్షలు రూ.60 వేలు
3 కిలోవాట్ 360 యూనిట్లు రూ.1.99 లక్షలు రూ.78 వేలు
పీఎం సూర్య ఘర్‌తో విద్యుత్ బిల్లుల మోతకు చెల్లు
సోలార్ పద్ధతితో
ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి
రాయితీతో పాటు
రుణ సదుపాయం
ఆరు నుంచి ఏడేళ్లలో పెట్టుబడి పొందవచ్చు
ఇంటి పైకప్పుపై 100 చదరపు అడుగుల స్థలంలో సోలార్ ప్యానల్స్, ప్రస్తుతం వాడే మీటర్ స్థానంలో నెట్ మీటర్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా వినియోగదారులు వాడే విద్యుత్‌ను లెక్కించే అవకాశం ఉంది. వినియోగదారులు పెట్టిన పెట్టుబడిని ఆరు నుంచి ఏడు ఏళ్లలో పొందవచ్చునని సోలార్ కంపెనీలు వెల్లడిస్తున్నాయి.
సోలార్ ప్యానల్స్, నెట్ మీటర్ అమర్చిన తర్వాత పోర్టల్‌లో బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. దీంతో సబ్సిడీ మొత్తాన్ని నెల రోజుల్లో ప్రభుత్వం చెల్లిస్తుంది.
100 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన కిలోవాట్ సామర్థ్యం గల రూఫ్ టాప్‌కు మూడు లేదా నాలుగు ప్యానల్స్‌ను వినియోగిస్తారు. కిలోవాట్ ప్యానల్స్‌కు నెలకు 120 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
5 కిలోవాట్ల సోలార్ ప్యానల్స్‌కు నెలకు 600 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో 300 యూనిట్లు విద్యుత్ ఇంటి అవసరాలకు పోగా మిగిలిన 300 యూనిట్లను విద్యుత్‌శాఖ కొనుగోలు చేసి సదరు మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలో జమ చేస్తుంది.
పథకం ఇలా పొందాలి
ఈ పథకాన్ని పొందేందుకు గృహ విద్యుత్ వాడకం 300 యూనిట్ల లోపు ఉండాలి. మొబైల్‌లో సోలార్ ఘర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇంటి విద్యుత్ సర్వీసు నెంబరు, వినియోగదారుని వివరాలు, ఆరు నెలల విద్యుత్ బిల్లుల కాపీలను జత చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు ఎన్ని కిలోవాట్స్ తీసుకుంటామనే దాన్ని బట్టి ఉంటుంది. ఐదు కిలో వాట్లకు రూ.1,900, అంతకు పైబడి రూ.5,990, పది కిలోవాట్లకు పైబడిన హెచ్‌టీ సర్వీసుదారులు రూ.11,800 చెల్లించాలి. మూడు కిలోవాట్లకు లోపు సర్వీసులకు ఎలాంటి ఫీజులు చెల్లించనవసరం లేదు.
ట్రాన్స్‌కో అనుమతులు పొందిన తర్వాత వెండర్లను ఎంపిక చేసుకోవాలి. ఒక కిలోవాట్‌కు రూ.30 వేల చొప్పున సబ్సిడీ మంజూరు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment