సమస్యల ఏకరువు
నష్ట పరిహారం చెల్లించాలి
నెల్లూరు రూరల్: కూటమి ప్రభుత్వంలో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాటిని పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌కు పెద్దఎత్తున తరలివస్తున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, ఇతర అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 280 వినతులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అందులో ఎక్కువగా రెవెన్యూ అంశాలకు సంబంధించినవే. కార్యక్రమంలో డీఆర్వో ఉదయభాస్కర్, జెడ్పీ సీఈఓ విద్యారమ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, డ్వామా పీడీ గంగా భవానీ, జిల్లా వ్యవసాయ అధికారిణి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● జిల్లాలో సమగ్ర జనగణనతోపాటు కులగణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. వింజమూరు మండలంలో భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని గురిజాల భాస్కర్ అనే వ్యక్తి వినతిపత్రం ఇచ్చాడు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రివ్యూ మీటింగ్ పెట్టాలని సభ్యుడు మురళీకృష్ణ యాదవ్ కోరారు. అట్రాసిటీ కేసుల పురోగతి, సాంఘిక సంక్షేమ హాస్టల్స్, గురుకుల పాఠశాలల పనితీరు సమీక్షించాలని విన్నవించారు.
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు
పోటెత్తిన జనం
వినతులు స్వీకరించిన
కలెక్టర్, అధికారులు
మొత్తం 280 వినతుల అందజేత
ముత్తుకూరు మండలంలోని నేలటూరులో ఏపీ జెన్‌కో ప్రాజెక్ట్ యాష్‌పాండ్ కట్టకు గండి పడి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆ మండల సీపీఎం కార్యదర్శి గడ్డం అంకయ్య కోరారు. ఆయన రైతులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అధికారులు సర్వే చేసి జాబితాను జెన్కో అధికారులకు ఇచ్చారన్నారు. వారు వెంటనే ఆర్డీఓకి చెక్కు రూపంలో నగదు ఇచ్చేశామని రైతులకు తెలియజేశారన్నారు. ఆర్డీఓకు ఇచ్చిన చెక్కును వెంటనే బాధిత రైతులకు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment