దేశ రాజ్యాంగం అత్యుత్తమం
● వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో
గణతంత్ర వేడుకలు
నెల్లూరు (బారకాసు): ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యుత్తమం అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగంలోని హక్కులతో పాటు బాధ్యతలను కూడా పౌరులు తెలుసుకోవాలని సూచించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురు వేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా దేశ ప్రజలకు హక్కులను కల్పించిన భారత రాజ్యాంగం అమలు ప్రతి ఒక్కరికీ ముఖ్యమని తెలిపారు. అంబేడ్కర్ కృషి ఫలితంగానే దేశంలో వెనుకబడిన వర్గాలు ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. భిన్న జాతులు, మతాలు, భాషలు, సంస్కృతుల, కులాలు ఉన్న భారతదేశంలో నేటికీ సమైక్యంగా కొనసాగుతున్నాం అంటే అందుకు అంబేడ్కర్ ఆధ్వర్యంలో రాసిన రాజ్యాంగమే కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment