
18న కోవూరు, ఆత్మకూరులో జాబ్‌మేళా
నెల్లూరు (పొగతోట): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయీమెంట్ ఆఫీస్, సీడాప్ సంయుక్తంగా ఈ నెల 18న కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆత్మకూరు ఎస్‌వీ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్ధుల్ ఖయ్యూమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 73823 91116, 9491284199 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
రెండు కొత్త బస్సు
సర్వీస్‌లు ప్రారంభం
నెల్లూరు సిటీ: నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో రెండు కొత్త బస్సు సర్వీసులను శనివారం ఏపీఎస్‌ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురే ష్‌రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు నుంచి పొదిలికి వయా పామూరు మీదుగా ఎక్స్‌ప్రెస్ సర్వీసు, అంబాపురం టిడ్కో నుంచి రాజుపాళెం వరకు పల్లె వెలుగు సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా రవాణా అధికారి మురళీబాబు, డిపో మేనేజర్ మురళీకృష్ణ, శివకేశవ్‌యాదవ్ పాల్గొన్నారు.
14 మంది ఉపాధి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
● అవకతవకలకు పాల్పడితే
చర్యలు తప్పవు : డ్వామా పీడీ
గంగాభవాని
● రూ.30,52,734 రికవరీకి ఆదేశాలు
● ఇందులో పీఆర్ శాఖ నుంచి రూ.3,71,832
సీతారామపురం: ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడిన 14 మంది సిబ్బందిపై సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదికలోనే శనివారం సస్పెన్షన్ వేటు వేస్తూ డ్వామా పీడీ గంగాభవాని చర్యలు తీసుకున్నారు. సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని పీడీ హెచ్చరించారు. స్థానిక సీ్త్ర శక్తి భవనం వద్ద శనివారం నిర్వహించిన 14వ విడత సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదికలో ఆమె పాల్గొని మాట్లాడారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మండలంలో రూ.8,35,69,875తో 649 రకాల ఉపాధి పనులు చేయగా వాటిపై సోషల్ ఆడిట్ బృంద సభ్యులు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి విచారణ చేపట్టి తుది నివేదికను పంచాయతీల వారీగా వెల్లడించారు. చాలా గ్రామాల్లో ఒకే కుటుంబంలో రెండు, మూడు జాబ్‌కార్డులు ఉన్నాయని, ఉపాధి హామీ పనుల్లో చాలా తేడాలు ఉన్నాయని, పని తక్కువగా ఉందని, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని, కొలతల ప్రకారం పనులు జరగలేదన్న వంటి విషయాలను సామాజిక తనిఖీ బృంద సభ్యులు అధికార యంత్రాంగం దృష్టికి తీసుకు వచ్చారు. వాస్తవాలను పరిశీలించిన డ్వామా పీడీ విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఏపీఓ సుభాషిని, ఈసీ సువార్తయ్య, ముగ్గురు టీఏలు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లతోపాటు ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఒక సీనియర్ మేట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. 14 పంచాయతీల్లో రూ.30,52,734 రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు జిల్లా విజిలెన్స్ అధికారిణి విజయలక్ష్మి, ఏపీడీ శంకర్‌నారాయణ, అంబుడ్స్‌మెన్ వెంకటరెడ్డి, ఎంపీపీ పద్మావతి, ఎంపీడీఓ భాస్కర్, ఈఓపీఆర్డీ భార్గవి తదితరులు పాల్గొన్నారు

18న కోవూరు, ఆత్మకూరులో జాబ్‌మేళా