వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయులతుది సీనియారిటీ జాబితా | - | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయులతుది సీనియారిటీ జాబితా

Published Fri, Apr 4 2025 12:11 AM | Last Updated on Fri, Apr 4 2025 12:11 AM

వెబ్‌

వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయులతుది సీనియారిటీ జాబితా

నెల్లూరు (టౌన్‌): సెకండరీ గ్రేడు, స్కూల్‌ అసిస్టెంట్ల సీనియారిటీ తుది జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతి కోసం సబ్జ్జెక్టు వైజ్‌ సీనియారిటీ జాబితాలను కూడా డీఈఓ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చెప్పారు. జాబితాలపై ఈనెల 11వ తేదీలోపు అభ్యంతరాలను తీసుకుంటామని, తగిన ధ్రువపత్రాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.

నేడు మంత్రి పార్థసారథి

జిల్లా పర్యటన

నెల్లూరు రూరల్‌: రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యే సోమిరెడ్డితో కలిసి తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలోని హౌసింగ్‌ లేఅవుట్‌ను మంత్రి పరిశీలిస్తారు. 11.30 గంటలకు పొదలకూరులో హౌసింగ్‌ లేఅవుట్‌ను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడతారు. మధ్యాహ్నం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు గూడూరుకు వెళతారు.

ఎట్టకేలకు వార్డెన్లకు

చార్జి మెమోలు

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): బీసీ సంక్షేమ శాఖలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు హాస్టల్‌ వార్డెన్లకు ఎట్టకేలకు చార్జ్‌ మెమోలను ఇచ్చారు. కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ ఆదేశాల మేరకు జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారిణి వెంకట లక్ష్మమ్మ మెమోలను గురువారం జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని విడవలూరు, మైపాడు బీసీ బాలుర హాస్టల్‌లో వార్డెన్లు రెండేళ్లుగా అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వచ్చాయి. సాక్షి పత్రికలో వార్డెన్ల అక్రమాలపై కథనం ప్రచురితం అయిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన కలెక్టర్‌ విచారణ జరిపి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో వారిచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో చార్జ్‌ మెమోలను జారీ చేశారు. అయితే వార్డెన్ల కై తే మెమోలు ఇచ్చారు గానీ, రెండేళ్లు వారి అక్రమాలకు సహకరించిన ఉన్నతాధికారులు, హాస్టళ్లను పర్యవేక్షణ చేసిన అధికారులపై చర్యల ఊసే లేకపోవడంపై ఆశాఖలో గుసగుసలు వినపడుతున్నాయి.

జిల్లా సాధనకు

ఉద్యమించాలి

ఉదయగిరి: జిల్లాలో అన్ని రంగాలలో వెనుకబడిన ఉదయగిరి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా సాధించుకునేందుకు రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్‌ కె.వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ఆయన గురువారం సాధన సమితి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా పూర్తి వివక్షకు గురవుతూ నేటికీ సరైన తాగు, సాగునీరు లేక పోవడంతో ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువవడంతో పల్లెప్రాంతాలు బోసిపోయి దర్శనమిస్తున్నాయన్నారు. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లోని 21 మండలాలను కలుపుకుని ఉదయగిరిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సాధన సమితి సభ్యులు దస్తగిరి అహ్మద్‌, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దేవదాయ భూముల్లో

అక్రమాలకు తావివ్వొద్దు

ఉలవపాడు: దేవదాయశాఖకు సంబంధించిన భూముల్లో అక్రమాలు జరగకుండా చూడాలని ఆ శాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ తెలిపారు. ఉలవపాడులోని నీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి సంబంఽధించిన భూములను ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శానంపూడిలో గురువారం పరిశీలించిన అనంతరం ఆయన ఉలవపాడు దేవస్థానం వద్దకు వచ్చి మాట్లాడారు. శానంపూడిలో భూములు లీజుకు తీసుకున్న వ్యక్తి అందులో రాళ్లు ఎత్తడం చేస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈఓ శ్రీనివాస్‌కు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయులతుది సీనియారిటీ జాబితా 1
1/2

వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయులతుది సీనియారిటీ జాబితా

వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయులతుది సీనియారిటీ జాబితా 2
2/2

వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయులతుది సీనియారిటీ జాబితా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement