
20 కేజీల గంజాయి స్వాధీనం
● ముగ్గురు నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి 20.200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీ పి.దయసాగర్ తన కార్యాలయంలో దాడుల వివరాలను శుక్రవారం వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా చెట్టికుల్లం గ్రామానికి చెందిన సుందర్ పాండి, నేతాజీ, సముత్తువాపురానికి చెందిన కుమార్‌లు గంజాయి విక్రేతలు. వీరు కొంతకాలంగా విశాఖపట్నంకు చెందిన హనుమాన్ అలియాస్ హనుమంత్ వద్ద గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి తమ ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ముచేసుకోసాగారు. శుక్రవారం ఏఈఎస్ జగదీశ్వర్‌రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించి చైన్నె వెళుతున్న ఆర్టీసీ బస్సుల్లో బ్యాగ్‌లను తనిఖీచేశారు. వాటిలో ఉన్న 20 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నిందితులు హనుమాన్ వద్ద రూ.90 వేలుకు గంజాయిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితులను, స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎకై ్సజ్ నెల్లూరు–2 స్టేషన్‌లో అప్పగించారు. ఈ తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐలు కాలేషావలి, ిసీహెచ్ పూర్ణకుమార్, హెడ్‌కానిస్టేబుల్ కిరణ్‌సింగ్, సిబ్బంది ఎ.శ్రీనివాసులు, కె.రమణయ్య, సుబ్రమణ్యం పాల్గొన్నారు.