యథేచ్ఛగా మట్టి దందా ! | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా మట్టి దందా !

Published Fri, Sep 27 2024 12:54 AM | Last Updated on Fri, Sep 27 2024 12:54 AM

యథేచ్

కదిరి అర్బన్‌: కదిరి మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. కొందరు టీడీపీ నాయకులు గ్రూపులుగా ఏర్పడి అక్రమంగా మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వందలాది టిప్పర్లతో కదిరి మండలంలోని తుమ్మల రోడ్డు సమీపంలోని దుర్గమ్మ గుడి గుట్ట, పర్తిగడ్డ సమీపంలో కొండగుట్టల తవ్వేస్తున్నారు. మట్టిని పట్టణంలోని అక్రమ లేఅవుట్లకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. రోజూ సుమారు ఆరేడు టిప్పర్లతో వందకుపైగా లోడ్ల మట్టిని తరలిస్తున్నారు. టిప్పర్‌ రూ.1500తో లెక్కేసినా రోజూ రూ.1.50 లక్షలు అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వచ్చిన రోజైతే మట్టిమాఫియాకు పండగే.

నిద్రమత్తులో అధికారులు..

కదిరి మండలంలో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని అక్రమంగా తరలిస్తుంటే మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖాధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త వాహనాలు కొనుగోలు..

మట్టి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుండటంతో మట్టి మాఫియా కొత్త వాహనాలు (జేసీబీ, హిటాచీ) సైతం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఎవరికీ బెదిరేదిలేదని బాహాటంగానే చెబుతున్నారు. పోలీస్‌, రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడుకున్నామని చెబుతుండటం గమనార్హం.

పట్టుబడితే కఠిన చర్యలు

కార్యాలయ పనుల నిమిత్తం విజయవాడకు తరచూ వెళ్లాల్సి వస్తోంది. దీన్ని అదునుగా చేసుకుని మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మట్టి అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకోవాలని కుమ్మరవాండ్లపల్లి వీఆర్‌ఓను ఆదేశించాము. అక్రమంగా మట్టి తరలిస్తూ పట్టుబడితే భారీ జరిమానాలు విధిస్తాం.

– మురళీకృష్ణ, తహసీల్దార్‌, కదిరి

కొండ, గుట్టలను కరిగించేస్తున్న తమ్ముళ్లు

నిద్రమత్తులో అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
యథేచ్ఛగా మట్టి దందా ! 1
1/1

యథేచ్ఛగా మట్టి దందా !

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement