వృద్ధుడి దుర్మరణం
మడకశిరరూరల్: తడకలపల్లి సమీపంలోని హిందూపురం హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఎల్లోటి గ్రామ రోడ్డు నుంచి ప్రధాన రోడ్డులోకి వచ్చి తడకలపల్లి వైపు మోపెడ్‌పై వెళ్తున్న గుర్తుతెలియని వృద్ధుడి (65)ని మడకశిర నుంచి హిందూపురం వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ఆస్పత్రికి తరలించారు. మృతుడు కర్ణాటక రాష్ట్రం మధుగిరి తాలుకాలోని ఐడీహళ్లికి చెందిన వ్యక్తి అయ్యుండొచ్చని భావిస్తున్నారు.
అనుమానాస్పద మృతి
మడకశిరరూరల్: వైజీపీ తండాకు చెందిన సుబ్బునాయక్ (21) శనివారం ఇంటి సమీపాన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య.. ఆత్మహత్య.. సాధారణ మరణమా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
ప్రయాణికురాలిపై
చేయిచేసుకున్న డ్రైవర్
గుత్తి: బస్సులోకి నెమ్మదిగా ఎక్కుతున్న ప్రయాణికురాలిపై ఆర్టీసీ డ్రైవర్ చేయి చేసుకున్నాడు. తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యుల ఆందోళనతో డ్రైవర్ బహిరంగ క్షమాపణ చెప్పాడు. వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని కమాటం వీధికి చెందిన షరీఫాబీ అనే వృద్ధురాలు తన కుమార్తెను వెంటబెట్టుకుని డోన్‌కు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి గుత్తికి రావడానికి ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కబోయింది. త్వరగా ఎక్కండంటూ డ్రైవర్ గద్దించాడు. ఆమె కాస్త నెమ్మదిగా ఎక్కుతుండటంతో కోపంలో డ్రైవర్ ఆమైపె చేయి చేసుకున్నాడు. అవమానభారంగా భావించిన షరీఫాబీ ఇక్కడ జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా తన కుమారుడికి సమాచారం చేరవేసింది. కుమారుడు రఫిక్ కమాటం వీధికి చెందిన వారితో కలిసి గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నాడు. బస్సు రాగానే కమాటం వీధికి చెందినవారు డ్రైవర్‌పై దాడి చేయడానికి ప్రయత్నించగా రఫిక్ వారించాడు. ఎస్‌ఐ సురేష్ సమక్షంలో ఆర్టీసీ ౖడ్రైవర్.. వృద్ధురాలికి క్షమాపణ చెప్పాడు. దీంతో వివాదం సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment