ముగిసిన సత్యసాయి జయంతి వేడుకలు
ప్రశాంతి నిలయం: పుట్టపర్తిలో ఈ నెల 18న ప్రారంభమైన సత్యసాయి 99వ జయంతి వేడుకలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ఏడు రోజులపాటు సాగిన మహా నారాయణ సేవలో భాగంగా దాదాపు 900 మంది సత్యసాయి సేవాదళ్ సభ్యులు 3.60 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ద్వారా నిర్వహించిన మెడికల్ క్యాంపులో 12,500 మందికి వైద్య సేవలందించారు. వేడుకలను విజయవంతం చేసిన భక్తులు, సత్యసాయి సేవాదళ్, ప్రభుత్వ అధికారులు అందరికీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్‌రాజు ధన్యవాదాలు తెలిపారు. రాబోవు శతజయంతి వేడుకలను మరింత విజయవంతం చేసేందుకు చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగుతామని చెప్పారు. ఇదిలా ఉండగా వేడుకలు ముగియడంతో దేశ విదేశాలకు చెందిన సత్యసాయి భక్తులు తమ స్వస్థలాలకు బయల్దేరారు.
సజావుగా కోఆపరేటివ్ అసోసియేషన్ ఎన్నికలు
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తిలోని జిల్లా కో ఆపరేటివ్ ఆడిట్ కార్యాలయంలో (డీసీఏఓ) ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు ఆదివారం సజావుగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగరమణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా తొమ్మిది మందితో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా సీసీ రామచంద్రయ్య, అసోసియేట్ అధ్యక్షులుగా సయ్యద్‌బాషా, ఉపాధ్యక్షులుగా రమష్‌బాబు, సెక్రటరీగా శ్రీరాములు, జాయింట్ సెక్రటరీగా శ్రీనాథ్, ట్రెజరర్‌గా రవి, మహిళా విభాగం సెక్రటరీగా రాధమ్మ, గ్రేడ్– 1 సెక్రటరీగా చెన్నకేశవులు, గ్రేడ్ –2 సెక్రటరీగా అనిల్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఎన్నికై న సభ్యులను సిబ్బంది ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment