బెల్టుషాపుల నిర్వహణకు వేలం
పట్టణ, గ్రామాల్లో మద్యాన్ని బెల్టుషాపుల ద్వారా అమ్మకాలు చేపట్టేందుకు వేలం నిర్వహించినట్లు తెలుస్తోంది. మద్యం షాపు వారికి అడ్వాన్సుగా చెల్లించి రోజూ మద్యం తీసుకొచ్చి బెల్టుషాపు వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి లైసెన్సు పొందిన మద్యం షాపుల్లో ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా దండుకుంటున్నారు. వీటిని బెల్టు షాపుల ద్వారా అమ్మేసరికి మరింత బాదుతున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు వ్యాపారులు నుంచి కొనుగోలు చేసిన ధరకు రూ.25 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment