ప్రాణాలు పోతున్నా.. పట్టదా?
తాడిపత్రి టౌన్: ప్రమాదమని తెలిసినా.. పరిమితికి మించి ప్రయాణికులను చేరవేయడంలో వాహనదారులు పోటీ పడుతూనే ఉన్నారు. శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాడిపత్రి పోలీసులు అప్రమత్తమై ఆదివారం సాయంత్రం యల్లనూరు రోడ్డు సర్కిల్‌లో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా పరిమితికి ప్రయాణికులను తరలిస్తున్న రెండు ఆటోలు, రెండు బొలెరోలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి వాహనాలను ఆర్టీఓకు అప్పగించారు. పరిమితికి మించి వాహన ప్రయాణం చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులను పోలీసులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment