సాలక్కగారి శ్రీనివాసులును అరెస్టు చేయాలి
● సీపీఎం నేతల డిమాండ్
పుట్టపర్తి: కొత్తచెరువు నెహ్రూ కాలనీలో ఇటీవల రస్తా విషయమై ఇంట్లోకి చొరబడి పార్వతమ్మ, ప్రణీత అనే ఇద్దరు మహిళలపై విచక్షణ రహితంగా దాడిచేసిన టీడీపీ నాయకుడు సాలక్కగారి శ్రీనివాసులును వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, కార్యవర్గ సభ్యుడు ఈఎస్ వెంకటేష్ డిమాండ్ చేశారు. బాధిత మహిళలను వారు ఆదివారం పరామర్శించారు. నిందితుడిని అరెస్టు చేసి.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీగా మహిళ ఉన్నా.. సాటి మహిళలపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా సభ్యుడు పెద్దన్న ,నియోజకవర్గ కార్యదర్శి బ్యాళ్ల అంజి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment