కూరగాయల సాగుతో లాభాలు
నేను మూడు ఎకరాల్లో ఆలుగడ్డ సాగు చేశా. ప్రస్తుతం ధర నిలకడగా ఉంటోంది. ఖర్చులు పోనూ ఎకరాకు రూ. 1 లక్ష వరకు ఆదాయం వస్తోంది. కూరగాయల పంటలతోనే అధిక లాభాలు వస్తున్నాయి.
– చండ్రాయుడు, రైతు, సుబ్బరాయనిపల్లి
మార్కెట్ సౌకర్యం కల్పించాలి
జిల్లాలో వారపు సంతలు తప్పా... పెద్ద మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో పండించిన కూరగాయలను బెంగళూరు, చైన్నె, మదనపల్లి, బాగేపల్లి తదితర మార్కెట్ లకు తరలించాల్సి వస్తోంది. ఇది చాలా ఖర్చుతో పాటు అధిక శ్రమతో కూడుకున్నది. అంత దూరం సరుకు తీసుకెళ్లలేక దళారులు ఎంత చెబితే అంతకు పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. – తిరుపాల్‌నాయక్, రైతు, పెడపల్లి
Comments
Please login to add a commentAdd a comment