ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం | Sakshi
Sakshi News home page

ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం

Published Mon, May 6 2024 4:30 AM

ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం

శ్రీకాకుళం అర్బన్‌: ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులతో పాటు ప్రజలందరిపైనా ఉందని ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ) కార్యదర్శి బి.ఎస్‌.రాంబాబు అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(ఏపీయూబీఈఏ) శ్రీకాకుళం రీజియన్‌ రీజనల్‌ కాన్ఫరెన్స్‌ రీజనల్‌ కార్యదర్శి బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ బ్యాంక్‌ ఉద్యోగులుగా 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం పూర్తయినందున కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం ఎన్నికల తర్వాత బ్యాంక్‌ల ప్రయివేటీకరణకు తెరతీస్తే బ్యాంకింగ్‌ రంగంలోని తొమ్మిది సంఘాలు కలిసి నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వ బ్యాంకింగ్‌ వ్యవస్థకు కట్టుబడి ఉండాలని, ఈ మేరకు ఒక ప్రకటన చేయాలని కోరారు. యూనియన్‌ బ్యాంక్‌ శ్రీకాకుళం రీజియన్‌ రీజనల్‌ హెడ్‌ ఎం.వి.తిలక్‌ మాట్లాడుతూ శ్రీకాకుళం రీజియన్‌ పరిధిలో 56 బ్రాంచిలు ఉన్నాయని, సుమారు రూ.7,632 కోట్లు వ్యాపారం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఏపీయూబీఈఏ అధ్యక్షుడు కాలె శ్రీనివాసరావు, ఏపీయూబీఈఏ ప్రధాన కార్యదర్శి వి.ఉదయ్‌కుమార్‌, ఏఐయూబీఈఏ ప్రధాన కార్యదర్శి ఎన్‌.శంకర్‌, యూనియన్‌ ప్రతినిధులు పి.విజయ్‌భాస్కర్‌రెడ్డి, జి.కరుణ, లక్ష్మీపతి, పి.సుమన్‌, కె.మోహనరావు, అనిల్‌, సూర్యకిరణ్‌, చంద్రశేఖర్‌, దుర్గాప్రసాద్‌, శ్యాం, వసంతరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement