మాజీ సైనికులు ఓటు హక్కు వినియోగించుకోవాలి | Sakshi
Sakshi News home page

మాజీ సైనికులు ఓటు హక్కు వినియోగించుకోవాలి

Published Mon, May 6 2024 4:30 AM

మాజీ సైనికులు ఓటు హక్కు వినియోగించుకోవాలి

శ్రీకాకుళం న్యూకాలనీ: మాజీ సైనికులంతా తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని మాజీ సైనిక సంక్షేమ సమాఖ్య ఉత్తరాంధ్ర అధ్యక్షుడు చిల్ల వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని పెద్దరెల్లి వీధిలో ఉన్న జిల్లా సైనిక సంక్షేమాధికారి కార్యాలయం ప్రాంగణంలో మాజీ సైనికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం మొత్తమ్మీద పోలిస్తే శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో మాజీ సైనికులు ఎన్నికల విధుల్లో పా ల్గొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇతర ఉద్యోగాల్లో చేరిన మాజీ సైనికులు కూడా విధుల్లో ఉన్నారని, వారంతా తప్పనిసరిగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం రథసప్తమి నాడు అరసవల్లిలో విశేషంగా సేవలు అందించిన మాజీ సైనికులు, వీర నారీమణులను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ సైనికుల సమాఖ్య చైర్మన్‌ గ్రూప్‌ కెప్టెన్‌ పి.ఈశ్వరరావు, గౌరవాధ్యక్షులు టి.కృష్ణారావు, ఎస్‌.ఎల్‌. రావు, ఉపాధ్యక్షులు వి.సూర్యనారాయణ, జనరల్‌ సెక్రటరీ పి.మురళీధరరావు, అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ ఎస్‌.రామకృష్ణ, కోశాధికారి ఎమ్‌.సింహాచలం, స్పోక్‌ పర్సన్‌ కె.కన్నారావు, మహిళా సెక్రెటరీలు ఎ.లక్ష్మి, కె.జగ్గమ్మ, సలహాదారులు పద్మావతి, ఎ.వి.జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement