ఏపీ లాసెట్‌కు 555 మంది హాజరు
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఏపీ లాసెట్–2024 (మూడేళ్ల, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీలో ప్రవేశాలకు) ఆదివారం ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించారు. జిల్లా నుంచి 651 మంది దరఖాస్తు చేసుకోగా, 555 మంది హాజరయ్యారు. 96 మంది గైర్హాజరయ్యారు.
పరీక్ష కేంద్రాలు వారీ హాజరు పరిశీలిస్తే నరసన్నపేట కోర్ టెక్నాలజీస్‌లో 330 మందికి 282, టెక్కలి ఐతం కళాశాలలో 120 మందికి 101, చిలకపాలేంలోని శివానీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో 101 మందికి 94 మంది, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్ లో 100 కి 78 మంది హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment