No Headline
ఇచ్ఛాపురం రూరల్: నిన్న మొన్నటి వరకు ఆ ఇంటి నలుచెరుగులా వినిపించిన పట్టీల చప్పుడు ఇప్పుడు మూగబోయింది. ఆ అమ్మాయి చేతిలో సందడిగా మోగిన గాజులు ఇప్పుడు నిశ్శబ్దమైపోయాయి. చెంగుచెంగున ఎగురుతూ ఆనందంగా కనిపించిన అమ్మాయి కదల్లేక మంచానికి పరిమితమైపోయింది. కళ్ల ముందే కన్నకూతురు చలనం లేకుండా పడి ఉండడం చూసి తల్లిదండ్రుల గుండె ముక్కలైంది. కన్నబిడ్డకు వచ్చిన కష్టాన్ని చూసి తట్టుకోలేక, చికిత్స చేయించేందుకు ఆర్థిక స్థోమత సరిపోక ఆ దంపతులు సాయం కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే..
డొంకూరు గ్రామానికి చెందిన దున్న మోహనరావు, తరిణమ్మల కుమార్తె దున్న సమీర స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అటు ఆటల్లో, ఇటు చదువులో ముందుండే సమీర రెండు నెలల కిందట అనారోగ్యానికి గురైంది. వైద్యులకు చూపిస్తే త్వరలో కోలుకుంటుంది అన్నారు. ఇంటి వద్దనే చికిత్స పొందిన సమీరాకు అకస్మాత్తుగా రెండు కాళ్లు, రెండు చేతులు చచ్చుబడిపోయాయి. దీంతో వేలాది రూ పాయలు ఖర్చు చేసి పలు ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. చివరికి ఒడిశా రాష్ట్రం కటక్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పక్షవాతంతో చికిత్స పొందుతోంది. అగ్నికి వాయువు తోడైనట్లు సమీరా వెన్నెముకలో రాచపుండు తయారవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని, దాతలు సాయం చేస్తూ తమ బిడ్డ మళ్లీ లేచి తిరుగుతుందని ఆశ పడుతున్నారు.
దాతలు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
సాయం చేయాలనుకునేవారు 6302970633
నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు
పెద్ద కష్టం
చచ్చుబడిన కాళ్లు, చేతులు
దాతల సాయం కోసం ఎదురు చూపులు
Comments
Please login to add a commentAdd a comment