ముగిసిన జోనల్ స్పోర్ట్స్ మీట్
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల/జూనియర్ కళాశాల జోన్–1 స్థాయి నాలుగు రోజుల స్పోర్ట్సు మీట్ ఆదివారంతో ముగిసింది. ఈ పోటీలకు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 21 పాఠశాలల నుంచి 800 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఓవరాల్ చాంపియన్‌షిప్, గేమ్స్ స్పోర్ట్సు చాంపియన్‌షిప్‌లను గురుగుబిల్లి గురుకుల పాఠశాల కై వసం చేసుకుంది. సీనియర్స్ వ్యక్తిగత చాంపియన్‌గా ఎ.లక్ష్మి (గురుగుబిల్లి) నిలిచింది. జూనియర్ విభాగంలో స్పోర్ట్సు చాంపియన్‌షిప్‌ను వియ్యంపేట, గేమ్స్ చాంపియన్‌షిప్‌ను పెద్దపాడు, ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను వియ్యంపేట నిలిచాయి. జూనియర్స్ వ్యక్తిగత చాంపియన్‌గా జీవనప్రియ నిలిచారు. ముగింపు కార్యక్రమంలో శ్రీకాకుళం అంబేడ్కర్ గురుకులాల కో–ఆర్డినేటర్ బాలాజీ నాయక్, విశాఖపట్నం కో–ఆర్డినేటర్ రూపవతి, విజయనగరం పూర్వపు కో–ఆర్డినేటర్ బి.చంద్రావతి, సెట్‌శ్రీ సీఈవో ప్రసాదరావు, ఎచ్చెర్ల ప్రిన్సిపాల్ ఎస్.పద్మజ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment