అర్జీల జోరు.. నిరసనల హోరు
శ్రీకాకుళం పాతబస్టాండ్:
అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా అర్జీదారుల నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ 73 అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలపై 30, పంచాయతీరాజ్ సమస్యలపై 12 ఉన్నాయి. ఫిర్యాదుల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో ఎల్.ఎన్.వి.శ్రీధర్ రాజ పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికకు 73 అర్జీలు
మరోవైపు వివిధ వర్గాల నిరసనలు
Comments
Please login to add a commentAdd a comment