‘చలి’ంచరా..?
ఎల్‌ఎన్ పేట: లక్ష్మీనర్సుపేట ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో 72 మంది ఉన్నారు. హాస్టల్‌కు బోరు, బావి లేదు. కొన్ని నెలల క్రితం వరకు ఉన్న బోరు మట్టితో కప్పి పెట్టుకుపోయింది. దీంతో మెగా రక్షిత తాగునీటి పథకం నుంచి ఒక కుళాయి ఏర్పాటు చేశారు. ఆ నీరే అన్నింటికీ ఆధారం. ఇన్వర్టర్ లేకపోవడంతో కరెంటు పోతే నరకం చూడాల్సి వస్తోంది. భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. చలికాలం వచ్చేసినా ఇంకా దుప్పట్లు, రగ్గులు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు.
చీకటిలో ఉంటున్నాం..
కరెంటు పోతే చీకటిలోనే ఉంటున్నాం. చదువుకునేందుకు ఇబ్బందిగా ఉంది. నిద్రపోయాక దోమల బెడద తప్పడం లేదు.
– టి.వంశీ, హాస్టల్ విద్యార్థి, 9వ తరగతి,
లక్ష్మీనర్సుపేట
కాస్మోటిక్ చార్జీల్లేవు
హాస్టల్ విద్యార్థులకు ప్రతి నెల ప్రభుత్వం నుంచి వచ్చే కాస్మోటిక్ చార్జీలు కొన్ని నెలలుగా ఇవ్వటం లేదు. స్నానాలకు, ఇతర అవసరాలకు నీరు లేకపోవటంతో ఇబ్బందిగా ఉంది. – బమ్మిడి కిరణ్, విద్యార్థి,
9వ తరగతి, లక్ష్మీనర్సుపేట హాస్టల్,
అప్పు చేసి పప్పు కూడు
పాతపట్నం: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అప్పు చేసి పప్పు కూడా పెట్టాల్సి వస్తోంది. పాతపట్నంలోని బాలుర ప్రీ మెట్రిక్ వసతి గృహంలో 76 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ టెక్కలి వార్డెన్ ఇన్‌చార్జిగా ఉన్నారు. వారానికి రెండు రోజులు మాత్రమే వస్తున్నారు. మెనూకు అవసరమైన నిధులివ్వడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఎస్సీ బాలికల వసతి గృహంలో 49 మంది విద్యార్థినులు ఉన్నా ఇక్కడ కూడా వార్డెన్ వారానికి రెండు రోజులే వస్తున్నారు. హాస్టళ్ల విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలను గత ప్రభుత్వం నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆ చార్జీలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
●
Comments
Please login to add a commentAdd a comment