భద్రత డొల్ల.. ఉండేదెలా..?
హాస్టళ్లు కాదు.. సమస్యల లోగిళ్లు
● ఉండేదెలా..?
కొత్తూరు: కొత్తూరు మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కురిగాం, కొత్తూరు ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలు దారుణ పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ హాస్టళ్ల పరిసరాల్లో దుర్గంధం వ్యాపిస్తోంది. భవనాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి.
చలికాలం వచ్చేసింది.. అయినా దుప్పట్లు, రగ్గుల పంపిణీ పూర్తి కాలేదు. హాస్టళ్లు తెరిచి ఐదునెలలు దాటింది.. అయినా కాస్మొటిక్స్ చార్జీలు చెల్లించలేదు. వేసవిలో ఊడిన తలుపులు బిగించిన దాఖలాలు లేవు. పాడైన భవనాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వార్డెన్లు అప్పు చేసి పప్పు కూడు పెడుతుంటే స్పందించిన నాయకుడూ లేడు. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల రక్షణపై సాక్షాత్తు హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులకు రక్షణ కల్పించాలని సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని హాస్టళ్ల పరిస్థితిని ‘సాక్షి’ పరిశీలించింది. ఈ విజిట్‌లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
శ్లాబ్ ఊడి పెచ్చులు పడుతున్న
బారువ కొత్తూరు, వాడపాలేం
వెనుకబడిన
తరగతుల
బాలికల
వసతిగృహ
భవనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
సంక్షేమ వసతి గృహాల్లో సంక్షేమం కరువైపోయింది. జిల్లాలో 31 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలుంటే వాటిన్నంటిలోనూ ఏదో ఒక సమస్య ఉంది. వాటిని పరిష్కరించేందుకు, మరమ్మతులు చేసేందుకు రూ.4.32కోట్లు అవసరమని, వెంటనే మంజూరు చేయాలని అధికారులు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి పంపించారు. కానీ, ఒక్క రూపాయి ఇంతవరకు విడుదల చేయలేదు. అలాగే జిల్లాలో 58 బీసీ వసతి గృహాల్లో సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు రూ.8కోట్లు కావాలని కూటమి ప్రభుత్వానికి నివేదించగా ఇంతవరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. జిల్లాలో ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో 10,268 మంది విద్యార్థులు చదువుతుండగా వీరికి ఆరు నెలలుగా కాస్మోటిక్ చార్జీలు చెల్లించడం లేదు. రూ. 60 లక్షల వరకు కాస్మోటిక్ బకాయిలు పేరుకుపోయాయి. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం విడుదల చేయలేదు. జిల్లాలో ఎస్సీ, బీసీ వసతి గృహాలకు ఎనిమిది నెలలుగా మెస్‌చార్జీలు చెల్లించడం లేదు. రూ. 23.60కోట్లు మేర బిల్లులు బకాయి ఉండటంతో వార్డెన్లు నరకయాతన అనుభవిస్తున్నారు.
సమస్యల నిలయాలు..
జిల్లాలోని పలు హాస్టళ్లను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాడు–నేడు కింద బాగు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం వహిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం ఆహారం వడ్డించడానికి నిధుల్లేని పరిస్థితి నెలకుంది. ఎనిమిది నెలలుగా మెస్‌చార్జీలు చెల్లించడం లేదు. పిల్లలకు ఇవ్వాల్సిన కాస్మోటిక్ చార్జీలను సైతం ఎగ్గొట్టింది. నిధుల్లేక వసతి గృహాల నిర్వహణ గాలిలో దీపంలా మారింది.
దుర్భర పరిస్థితి..
● శిథిలావస్థలో ఉన్న భవనాలు, శ్లాబ్‌లు పెచ్చులూడిన పరిస్థితులు ఉన్న వసతి గృహాలు దయనీయంగా తయారయ్యాయి.
● పిల్లలకు తగినన్ని గదుల్లేవు. పాడైన ట్రంకు పెట్టెలు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి.
● విరిగిన తలుపులు, కిటికీలు, పగిలిన నీటి కుళాయిలు, లీకేజీలు, పనిచేయని మరుగుదొడ్లు ఇలా ఒకటేంటి అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయి.
● చలికాలం వచ్చినా ఇంకా దుప్పట్లు, రగ్గుల పంపిణీ సంపూర్ణంగా జరగలేదు.
● చాలా చోట్ల దోమ తెరలను ఏర్పాటు చేయలేదు.
వార్డెన్ల పరిస్థితేంటి..
● సంక్షేమ హాస్టళ్లలో మెస్‌చార్జీలు, కాస్మోటిక్ ఛార్జీల బకాయిలు పేరుకుపోయాయి.
● బీసీ, ఎస్సీ వేల్ఫేర్ హాస్టళ్లకు సంబంధించి రూ.23.60కోట్ల మేర బిల్లులు ఎనిమిది నెలలు గా విడుదల కావడం లేదు. నిధులు లేక వార్డెన్లు చేతులేత్తేసే పరిస్థితి వచ్చింది.
● కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదని, ప్రభుత్వ బిల్లులు విడుదల చేస్తేనే విద్యార్థులకు మెనూ అమలు చేయగలమని చెబుతున్నారు.
● కాస్మోటిక్స్ చార్జీల పరిస్థితి కూడా అంతే. ఆరు నెలలుగా నిధులు విడుదల కాలేదు.
హాస్టల్స్‌లో భద్రత డొల్ల..
● సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై తాజాగా హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భద్రత లేదని ఆక్షేపించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆ వ్యాఖ్యలకు అద్దం పట్టేలా ఉన్నాయి. చాలా వసతి గృహాలకు ప్రహరీ లేదు. సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ అనేది ఎక్కడా లేదు. సీసీ కెమెరాల ఊసే లేదు. ఇలా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కొన్ని సూచనలు చేసింది.
● హాస్టల్ భవనం చుట్టూ ప్రహరీ నిర్మించాలి. గేటు ఏర్పాటు చేయాలి.
● గోడపై సోలార్ ఫెన్సింగ్ వేయాలి. హాస్టల్‌కు వచ్చి, వెళ్లే వారి వివరాలు నమోదుకు రిజిస్టర్ ఉండాలి.
● హాస్టల్ ప్రవేశ మార్గాలు, కారిడార్, కామన్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సంబంధిత పుటేజ్‌ను అనధికార వ్యక్తులు విని యోగించకుండా చర్యలు తీసుకోవాలి.
● బాత్‌రూమ్‌లు, టాయిలెట్లు పరిశుభ్రంగా నిర్వహించాలి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి.
కావల్సిన నిధులు
రక్షణ ప్రశ్నార్థకం
నరసన్నపేట: మండలంలో వసతి గృహాలు ఏడు ఉన్నాయి. వీటిలో రెసిడెన్షియల్ హాస్టల్స్ రెండు ఉండగా మిగిలినవి వసతి గృహాలు. బాలికల వసతి గృహాలు నాలుగు ఉన్నాయి. వీటిల్లో రక్షణ అంతంతమాత్రంగానే ఉంది. నరసన్నపేటలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహం ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. వసతి గృహం చెంతనే మురుగు కాలువ ఉండటం వల్ల తరుచూ విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. సవరబొంతు ఆశ్రమ పాఠశాలలో వార్డెన్లు లేరు. టీచర్లే నెలకొకరు చొప్పున వార్డెన్ బాధ్యతలు చూస్తున్నారు. నైట్ వాచ్‌మెన్లు లేకపోవడంతో పిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. శ్రీముఖలింగం బీసీ బాలురు వసతి గృహంలో ఇన్వర్టర్ లేదు. వసతి గృహం వార్డెన్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో పర్యవేక్షణ కొరవడుతోంది.
కూటమి ప్రభుత్వంలో కనిపించని సంక్షేమం
ఎనిమిది నెలలుగా మెస్‌చార్జీలు పెండింగ్
అప్పులతో నడపలేక వార్డెన్ల అవస్థలు
ఆరు నెలలుగా విడుదల కాని కాస్మోటిక్ చార్జీలు
ఉన్న వాటికే నిధులివ్వని కూటమి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు
ముందుకెళ్లగలదా?
సమస్యల తిష్ట
సోంపేట: మండలంలోని సోంపేట సాంఘిక సంక్షేమ బాలికల, బారువ కొత్తూరు వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. బారువ కొత్తూరు బాలికల వసతి గృహంలో పిల్లలు రాత్రిళ్లు ఉండలేక ఇళ్లకు వెళ్లిపోతున్నారు. సోంపేట వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో టాయిలెట్స్‌కు మూడు నెలలుగా తలుపులు లేవు. మామిడి పల్లి వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. ఈ ప్రాంతంలో అడవి పందులు, ఎలుగు బంట్ల సంచారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment