పైసా వసూల్
● ప్రభుత్వ ర్యాంపుల్లో అక్రమ వసూళ్లు
● ఫోన్ పే ద్వారా ఇసుక కప్పం వసూలు
● ఫిర్యాదులు చేసినా మారని పరిస్థితులు
● ఫిర్యాదుచేసినందుకు మరింత రేటు పెంచిన వైనం
ఇసుక లారీ యజ మాని చేత ఇసుక కోసం ఫోన్ పే చేయించుకున్న స్క్రీన్ షాట్ ఇది. బూర్జ మండలం నారాయణపురంలో కేతా సాయి కుమార్ తనకు ఫోన్ పే ద్వారా రూ.20వేలు వేయించుకుని జరిపిన లావాదేవీ ఇది. దాదాపు ఇక్కడ లావాదేవీలన్నీ ఈయన అకౌంట్ ద్వారానే జరుగుతున్నాయి. దీనికి అదనంగా సీనరేజీ చార్జీని చలానా ద్వారా తీసుకుంటున్నారు.
ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అవినీతి బాగోతానికి సాక్ష్యమిది. గార ర్యాంపులో ఉన్న గోగినేని ప్రేమ్‌సాగర్ అనే వ్యక్తి ఇసుక కోసం వచ్చిన వారి నుంచి రూ.10వేలు ఫోన్ పే చేయించుకున్న స్క్రీన్ షాట్ ఇది. ఈ ర్యాంపునకు వచ్చే వారిలో దాదాపు ఈయనకు ఫోన్ పే చేస్తున్నారు. అదనంగా సీనరేజీ చార్జీ చలానా ద్వారా అధికారికంగా వసూలు చేస్తున్నారు.
ఇసుక ర్యాంపులో ఉంటున్న పిండి అప్పన్న అనే వ్యక్తి ఇసుక కోసం వచ్చిన వారి నుంచి రూ.13 వేలు ఫోన్ పే చేయించుకున్న స్క్రీన్ షాట్ ఇది. తనకు ఫోన్ పే చేసిన తర్వాతే లోడింగ్ కోసం లారీని ర్యాంపులోకి అనుమతించారు. అనధికారికంగా తీసుకున్న మొత్తానికి అదనంగా సీనరేజీ చార్జీని చలానా ద్వారా తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment