గాయపడిన వ్యక్తి మృతి
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పురపాలక సంఘం పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బలరాంపేటకు చెందిన ఉయ్యల వంశీకృష్ణ(24) ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో చికిత్స పొందుతూ మృతి చెందగా, అతని బావ కృష్ణ బరంపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతి చెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. దీంతో ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. పట్టణ ఎస్‌ఐ ఇ.చిన్నంనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బోటు బోల్తాపడి వ్యక్తి మృతి
రణస్థలం: మండలంలోని అల్లివలస గ్రామానికి చెందిన వాసుపల్లి అనిల్ కుమార్(34) బోటు బోల్తా పడడంతో మృతి చెందాడు. జే.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతుడు వాసుపల్లి అనిల్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు యర్రయ్య, గుంటు అమ్మోరు సముద్రంలో వేటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీరానికి వంద మీటర్లు దూరంలో భారీ కెరటానికి పడవ బోల్తా పడడంతో అనిల్ కుమార్ సముద్రంలో మునిగి మృతి చెందాడు. మిగతా ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు. తదుపరి గ్రామస్తుల సహకారంతో అనిల్ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతుడికి భార్య లక్ష్మి, రెండేళ్ల కుమారుడు జయ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జే.ఆర్.పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గడ్డిమందు తాగి
రైతు ఆత్మహత్య
కాశీబుగ్గ: పలాస మండలం టెక్కలిపట్నం పంచాయతీ బంజీరుపేట గ్రామానికి చెందిన కొర్ల పాపారావు(62) అనే రైతు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆదివారం తన పంటపొలానికి వెళ్లి గడ్డిమందు తాగి పడిపోవడంతో గమనించిన భార్య కొర్ల నారాయణమ్మ గ్రామస్తులకు సమాచారం అందించడంతో 108కు ఫోన్ చేసి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవల కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆత్మహత్య ఎందుకు చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై కాశీబుగ్గ ఎస్‌హెచ్‌ఓ సీఐ మోహనరావు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment