జనసమూహాలున్న చోట మరుగుదొడ్లు తప్పనిసరి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జన సమూహాలు అధికంగా ఉండే చోట్ల మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్, స్వచ్ భారత్ మిషన్ గ్రామిన్, డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్‌లపై ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి సోమవారం సమీక్షించారు. మేజర్ పంచాయతీలు, గ్రామాలతో సంబంధం లేకుండా క్రౌడ్ ఉన్న దేవాలయాల వద్ద మరుగుదొడ్లు నిర్మించి రన్నింగ్ వాటర్ ఉండేలా చూడాలని డీపీఓను ఆదేశించారు. క్రౌడ్ ఉన్న ముఖ్య ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేకపోతే మరుగుదొడ్లు నిర్మించి రన్నింగ్ వాటర్ ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ భవనాల వద్ద మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లాలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర మరుగుదొడ్లు ఉండేటట్లు చూడాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా మరుగుదొడ్లు నిర్మాణం, మరుగుదొడ్లు వద్ద బ్యూటిఫికేషన్, రన్నింగ్ వాటర్ ఉండాలని, పరిశుభ్రత చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment