వైభవంగా లక్ష దీపోత్సవం
కొత్తూరు: మండల కేంద్రంలోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆదివారం రాత్రి లక్ష దీపోత్సవం కనుల పండువగా సాగింది. ఆలయ ధర్మకర్తలు బరాటం గోవిందరావు, వేలాది మంది భక్తుల సమక్షంలో వివిధ ఆకృతుల్లో దీపాలు వెలిగించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు, అన్నదానం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
స్కూల్‌గేమ్స్ జూడోలో
పతకాల పంట
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలబాలికల జూడో చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. రేణిగుంట వేదికగా ఈ నెల 24, 25 తేదీల్లో జరిగిన ఈ పోటీల్లో రెండు బంగారు, మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు సాధించి శభాష్ అనిపించారు. బాలురు విభాగంలో ప్రసాద్ బంగారు పతకం, నవీన్, శివ, షణ్ముఖ కాంస్య పతకాలు సాధించగా, బాలికల విభాగంలో సౌమ్య బంగారు పతకం సాధించింది. ఓవరాల్ చాంపియన్‌షిప్ కేటగిరిలో బాలురు 3వ స్థానంలో, బాలికలు 4వ స్థానంలో నిలిచి సత్తాచాటారు. మేనేజర్‌గా వ్యవహరించిన పి.జగదీశ్వరరావు(పీఈటీ పోలవరం), క్రీడాకారులను డీఈఓ తిరుమల చైతన్య, ఎస్‌జీఎఫ్ ప్రతినిధులు బీవీ రమణ, ఎంవీ రమణ, ఎం.సాంబమూర్తి, జూడో సంఘ ప్రతినిధులు ఆదివారం అభినందించారు.
సాయిబాబా గుడిలో చోరీ
బూర్జ: మండలంలోని కొల్లివలసలో సాయిబాబా గుడిలో వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబా మందిరంలో భక్తుల దర్శనార్ధం ప్రధాన అర్చకులు గుడి తలుపుల వేయకుండా వెళ్లిపోయారు. శుక్రవారం దర్శనానికి వచ్చిన భక్తులు వెండి కిరీటం, శఠగోపం కలిపి సుమారు 25 తులాల ఆభరణాలు కనిపించకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment