హైందవ ధర్మాన్ని కాపాడుకుందాం
పొందూరు:
హైందవ సమాజాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద అన్నారు. మండలంలోని కృష్ణాపురం ఆనందాశ్రమంలో అఖిలాంధ్ర హిందూ మహా సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ నిత్యం శ్రీరామనామ జపం, అభిషేకాలు వంటివి చేస్తే హింధూ ధర్మం కాపాడిన వారమవుతామని చెప్పారు. సీ్త్రలను అగౌరవపరచడం, గోహత్యలు, దేవాలయ వ్యవస్థ సరిగా లేకపోవడం, ధార్మిక గ్రంథాలను తప్పడు భావాలతో ప్రచారం చేయడం వంటి దుర్మార్గపు చర్యలను అడ్డుకోవాలన్నారు. హింధూ ధర్మ పరిరక్షణకు అందరూ ఏకంకావాలని పిలుపునిచ్చారు. ముస్లింలకు వక్ఫ్‌బోర్డు, క్రిస్టియన్లకు ప్రత్యేక బోర్డులు ఉన్నట్లు, హిందువులకు కూడా ప్రత్యేక బోర్డులను ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఒంగోలు భైరవానంద స్వామి, మంగళగిరి దయానంద దత్త స్వామి, అహోబిల జీయర్ స్వామీ, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment