మహిమాన్వితం సూర్యోపాసన
శ్రీకాకుళం కల్చరల్: సూర్యోపాసన ఎంతో మహిమాన్వితమైనదని, సాధనతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని రుషిపీఠం వ్యవస్థాపకులు సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్‌లో ఉపనిషన్మందిరం, సుమిత్రా కళాసమితి సంయుక్త నిర్వహణలో ‘శ్రీసూర్య దర్శనం’పై ప్రవచన యజ్ఞం రెండో రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకు దేహానికి ఉన్న సంబంధం రాజుకు, ప్రజలకు మధ్య ఉన్న సంబంధం వంటిదన్నారు. రాజ్యపాలన భోగం కోసం కాదని, యోగం కోసమని చెప్పారు. కార్యక్రమంలో మందిరం అధ్యక్షులు గుమ్మా నగేష్, సుమిత్రా కళాసమితి అధ్యక్షులు ఇప్పిలి శంకరశర్మ, నిష్టల నర్సింహమూర్తి, పులఖండం శ్రీనివాసరావు, గుత్తు చిన్నారావు, డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, తెన్నేటి విక్రమశర్మ, మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, కొంక్యాన మురళీధర్, వి.కామేశ్వరరావు, పి.బాబూరావు, సనపల నారాయణమూర్తి, రమేష్‌శర్మ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment