టెండ‘రింగ్’
● అంగన్‌వాడీలకు స్టేషనరీ సరఫరా
● కొందరికే దక్కేలా వ్యూహాలు
● ఐసీడీఎస్‌లో వివాదాస్పదంగా
షార్ట్ టెండర్
శ్రీకాకుళం అర్బన్: అంగన్‌వాడీ కేంద్రాలకు స్టేష నరీ సరఫరా కోసం ఆహ్వానించిన టెండర్లు వివా దాస్పదంగా మారాయి. ఎన్నడూలేని విధంగా ఐసీడీఎస్‌లో టెండర్ల ప్రక్రియలో ‘రింగ్’ అయ్యేందుకు కీలక వ్యక్తులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు ఓ ప్రాజెక్టు అధికారి మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో 16 ప్రాజెక్టుల పరిధిలో స్టేషనరీ తదితర సామగ్రి సరఫరా చేసేందుకు ఈ నెల 15న షార్ట్ టెండర్‌ను ఆహ్వానిస్తూ ఐసీడీఎస్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు సీల్డ్ టెండర్(బాక్స్) దాఖలు కు ఈ నెల 25, 26 తేదీల్లో గడువులోనే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. అంతకుముందే ఆ ప్రాజెక్టు అధికారి అంగన్‌వాడీ కేంద్రాల సామగ్రి వ్యవహారాలతో సంబంధం లేనప్పటికీ, అంతా తానై టెండరింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో దరఖాస్తు చేసుకునేందుకు కూడా తనకు అనుకూలంగా ఉన్నవారు మినహా మిగిలిన వారికి అవకాశం లేకుండా అడ్డుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు ఆసక్తిదారులు టెండర్ వేసేందుకు ముందుకు వచ్చినా కార్యాలయంలో టెండర్ పత్రాలను ఇవ్వకుండా గడువు ముగిసినంత వరకూ వ్యవహారం నడిపినట్లు బాధితులు చెబుతున్నారు.
జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో టెండర్ ప్రక్రియ జరగాల్సి ఉండగా విశ్వసనీయ సమాచారం మేర కు మంగళవారం సాయంత్రానికి కేవలం నాలుగు దరఖాస్తులు మాత్రమే టెండర్ బాక్స్‌లో పడినట్లు తెలుస్తోంది. ఇవి కూడా ఒక వ్యక్తికి సంబంధించిన బినామీలవేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఇటువంటి పరిస్థితిని తాము చూడలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోందని విమర్శిస్తున్నారు. కోటబొమ్మాళికి చెందిన ఓ వ్యక్తి ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయ త్నించడంతో ఈ టెండరింగ్ వ్యవహారం బయటకు పొక్కింది. ఎలాగైనా తమవారికి టెండర్‌లు దక్కేలా ప్రయత్నిస్తున్న దళారీ అధికారుల పనితీరుపై ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment