ఫోన్ కాల్‌కు తక్షణమే స్పందించాలి
శ్రీకాకుళం క్రైమ్ : అగ్ని ప్రమాదం సంభవించిందని వచ్చే ఫోన్‌కాల్స్‌పై అప్రమత్తంగా ఉండి తక్షణమే స్పందించాలని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక విభాగపు అడిషనల్ డైరెక్టర్ జి.శ్రీనివాసులు సంబంధిత విభాగపు అధికారులు, సిబ్బందిని ఆదేశించా రు. బుధవారం జిల్లా అగ్నిమాపక కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా జిల్లా అగ్నిమాపక అధికారి జడ్డు మోహనరావు, సహాయాధికారి వరప్రసాదరావులతో జిల్లా పరిస్థితులపై సమీక్షించారు. ఇండస్ట్రియల్ ప్రాంతాలు, ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాలు గురించి, ఉన్న యంత్రాలు, పరికరాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రతి పరికరాన్ని, ఫైర్ రెస్క్యూ ఇంజిన్లు పనిచేసే తీరును సిబ్బందితో స్వయంగా తనిఖీ చేయించి పరిశీలించారు. ప్రమాదాలు సంభవించేటప్పుడు ఎలా జాగ్రత్తలు వహించాలన్నది సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది 30 మంది వరకు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment