ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

Published Tue, May 7 2024 5:20 AM

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ఆత్మకూరు (ఎస్‌)(సూర్యాపేట) : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకటరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆత్మకూరు ఎస్‌. మండలంలోని పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలించి మాట్లాడారు. ధాన్యం తడిసిందని అధైర్య పడవద్దన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ముందస్తుగా తార్పాలిన్లు అందుబాటులో ఉంచామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాగింగ్‌ మిల్లులకు పంపాలని, మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా 31,335 మంది రైతుల నుంచి 1,84,485.000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు ఇప్పటివరకు రూ. 225 కోట్లు చెల్లించామని వివరించారు. కేంద్రాల్లో కొత్త గోనె సంచులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వినోద్‌ కుమార్‌, పీఏసీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement