త్వరలో ప్రమాద పరిష్కార బృందాలు | - | Sakshi
Sakshi News home page

త్వరలో ప్రమాద పరిష్కార బృందాలు

Published Fri, Sep 27 2024 1:30 AM | Last Updated on Fri, Sep 27 2024 1:30 AM

త్వరల

భానుపురి (సూర్యాపేట) : జిల్లా పరిధిలోని 365, 167 హైవేలపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగా త్వరలో ప్రమాద పరిష్కార బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ వెల్లడించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌తో కలిసి కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ప్రమాద పరిష్కార బృందంలో ఒక పోలీస్‌ అధికారి, మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎన్‌ హెచ్‌ఏఐ అధికారి, ఆర్‌ అండ్‌బీ అధికారి, పంచాయతీరాజ్‌ అధికారి, ఆర్టీసీ డిపో మేనేజర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, మండల స్థాయి అధికారి ఉంటారని పేర్కొన్నారు. వీరు వారి పరిధిలోని రోడ్లను పరిశీలిస్తూ నివేదిక అందజేయాలన్నారు. జిల్లా పరిధిలో మూడు హైవేలు ఉన్నాయని వీటిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో 65నంబర్‌ హైవేపై 37 బ్లాక్‌ స్పాట్లు, అలాగే 365, 167 హైవేలపై 5 బ్లాక్‌స్పాట్లు గుర్తించామన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, ఎన్‌ హెచ్‌ ఐ 365బీబీ డిప్యూటీ మేనేజర్‌ రాహుల్‌, ఎన్‌ హెచ్‌ 65 మేనేజర్‌ టెక్‌ రాధాశ్యాం షైనీ, ఇంజనీర్‌ నాగకష్ణ , పీఆర్‌ఈఈ మాధవి, సూర్యాపేట ఆర్డీఓ వేణు మాధవరావు, మున్సిపల్‌ కమిషనర్‌ బి. శ్రీనివాస్‌ ,కోదాడ మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ రమాదేవి, హుజూర్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఇంట్రా ఈఈ శ్రీనివాసరావు, రవాణా శాఖ అధికారి సురేష్‌ రెడ్డి పాల్గొన్నారు

చాకలి ఐలమ్మ ఆశయాలను

స్ఫూర్తిగా తీసుకోవాలి

వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని, ప్రతి ఒక్కరూ ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారన్నారు. ప్రజలందరి స్వేచ్ఛ కోసం, భూమి కోసం, విముక్తి కోసం పోరాడిన వీరవనిత అని కలెక్టర్‌ కొనియాడారు. ఎమ్మెల్యే మందుల సామేల్‌ మాట్లాడుతూ గత పాలకులు చాకలి ఐలమ్మ పోరాటాన్ని మరిచారని, సీఎం రేవంత్‌ రెడ్డి .. కోఠి మహిళా యూనివర్సిటీకి ఆమె పేరుపెట్టారని చెప్పారు. ఐలమ్మ విగ్రహాన్ని తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, డీటీడీఓ శంకర్‌, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, టీఎన్జీవోస్‌ సెక్రటరీ దున్న శ్యామ్‌ పాల్గొన్నారు.

అంగన్‌వాడీ టీచర్ల చేతుల్లోనే భవితవ్యం

భారత భవితవ్యం అంగన్‌వాడీ టీచర్ల చేతుల్లోనే ఉందని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌ అన్నారు. పోషణ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం సూర్యాపేటలో నిర్వహించిన ప్రాజెక్టు లెవల్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు పిల్లల మెదడు అభివృద్ధి చెందడానికి పోషకాహారం చాలా అవసరం అని అన్నారు.అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలు క్రమం తప్పకుండా హాజరయ్యేలా శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, ప్రాజెక్టు సీడీపీఓ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
త్వరలో ప్రమాద పరిష్కార బృందాలు1
1/1

త్వరలో ప్రమాద పరిష్కార బృందాలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement