సాక్షి ‘స్పెల్ బీ’కి అపూర్వ స్పందన
సూర్యాపేట టౌన్: ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమండ్రి, డ్యూక్స్ వాఫీ సహకారంతో సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో సాక్షి స్పెల్ బీ, మ్యాథ్స్ బీ 2వ లెవల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలలో నిర్వహించిన ఈ పరీక్షలో సూర్యాపేటలోని జయ పాఠశాల, కోదాడలోని తేజ విద్యాలయం, ఎస్‌పీఆర్ గురుకుల్ పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాక్షి స్పెల్ బీ కేటగిరి 1 నుంచి 4వరకు, మ్యాథ్స్ బీ కేటగిరి 1 నుంచి 4 వరకు పరీక్ష నిర్వహించారు. సాక్షి స్పెల్ బి కేటగిరి 1లో ఇద్దరు, కేటగిరి 2లో ఆరుగురు, కేటగిరి 3లో 69 మంది, కేటగిరి 4 పరీక్షకు 30 మంది హాజరయ్యారు. అలాగే మ్యాథ్స్ బీ కేటగిరి 1లో ఇద్దరు, కేటగిరి 2లో నలుగురు, కేటగిరి 3లో 11మంది, కేటగిరి 4లో ఇద్దరు పరీక్ష రాశారు. ఈ కార్యక్రమంలో జయ పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ, కోదాడ తేజ విద్యాలయం కరస్పాండెంట్ సోమిరెడ్డి, ప్రిన్సిపాల్ రమాదేవి, మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ఎం.బ్రహ్మారెడ్డి, సౌజన్య, కోదాడ ఎస్‌పీఆర్ గురుకుల్ పాఠశాల యాజమాన్యం మల్లెల శ్రావణి, యడ్మ మేధ, యాడ్స్ అసిస్టెంట్ ఆఫీసర్ వేములకొండ జానయ్య, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ అనమాల యాకయ్య, టౌన్ రిపోర్టర్ మాదగాని వేణు, సిబ్బంది పాల్గొన్నారు.
కొత్త పదాలు నేర్చుకున్నా
సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్‌బీ పరీక్ష రాశాను. మొదటి లెవల్‌లో క్వాలిఫై అయి రెండో లెవల్ పరీక్ష రాశాను. ఈ పరీక్ష రాయడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఇంగ్లిష్‌లో కొత్త పదాలు నేర్చుకున్నా. గత సంవత్సరం కూడా పరీక్ష రాశాను.
– శ్రేష్ఠ, 7వ తరగతి,
జయ పాఠశాల,సూర్యాపేట
స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాశా
సాక్షి స్పెల్ బీ పరీక్ష రాశాను. ఈ పరీక్ష రాయడం చాలా హ్యాపీగా ఉంది. పరీక్ష రాస్తున్నంత సేపు ఎన్నో కొత్త ఇంగ్లిష్ పదాలు నేర్చుకున్నా. ఈ పదాలు మున్ముందు ఎంతగానో ఉపయోగపడతాయి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పరీక్ష రాశాను. – కీర్తన, 7వ తరగతి,
జయ పాఠశాల, సూర్యాపేట
అనుభవం వచ్చింది
సాక్షి స్పెల్‌బీ పరీక్ష రాయడం ద్వారా ఎంతగానో అనుభవం వచ్చింది. ఇలాంటి పరీక్ష రాయడం ద్వారా ఎలాంటి భయం లేకుండా భవిష్యత్‌లో పోటీ పరీక్షలు సులభంగా రాసేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష రాయడం ఆనందంగా ఉంది.
– అజ్మిత్ హుస్సేన్,
7వ తరగతి, తేజ విద్యాలయం, కోదాడ
పోటీ పరీక్షలకు ఉపయోగం
సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యాథ్స్ బీ పరీక్షలో పాల్గొనడం హ్యాపీగా ఉంది. మ్యాథ్స్ బీ పరీక్షలో కొన్ని టిప్స్ నేర్చుకున్నా. మున్ముందు టిప్స్ ఎంతో ఉపయోగపడతాయి. భవిష్యత్‌లో పోటీ పరీక్షలు రాసేందుకు ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయి. – డి.కేదరి, 7వ తరగతి,
ఎస్‌పీఆర్ గురుకుల్, కోదాడ
కొత్త పదాలు తెలుసుకుంటారు
సాక్షి మీడియా సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్ బీ నిర్వహించడం అభినందనీయం. ఇలాంటి పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థుల్లో పరీక్షలంటే భయం పోయి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే స్పెల్‌బీలో కొత్త ఇంగ్లిష్ పదాలు నేర్చుకుంటారు. పరీక్షలు నిర్వహిస్తున్న సాక్షి మీడియాకు ధన్యవాదాలు. – బింగి జ్యోతి,
జయ పాఠశాల డైరెక్టర్, సూర్యాపేట
అనేక విషయాలు తెలుసుకున్నా
సాక్షి మీడియా నిర్వహించిన మ్యాథ్స్ బీ పరీక్ష రాశాను. ఈ పరీక్ష రాయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పరీక్ష రాయడం ద్వారా గణితంలో అనేక విషయాలు తెలుసుకున్నా. మ్యాథ్స్ సులభంగా అర్థం కావడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.
– గర్విత, 6వ తరగతి, తేజ విద్యాలయం, కోదాడ
12 ఏళ్లుగా పరీక్షలు రాస్తున్నారు
సాక్షి స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పరీక్షలను 12ఏళ్లుగా మా పాఠశాలల నుంచి విద్యార్థులు రాస్తున్నారు. మ్యాథ్స్ బీ పరీక్ష రాయడం ద్వారా గణితంలో టిప్స్ నేర్చుకుని గణితం సులభంగా చేయడానికి ఉపయోగపడుతుంది. సులభంగా పదాలు అర్థం చేసుకోవడానికి స్పెల్‌బీ పరీక్ష ఉపయోగపడుతుంది. – ఎం.బ్రహ్మారెడ్డి, మ్యాథ్స్
ఉపాధ్యాయుడు, తేజ విద్యాలయం కోదాడ
పోటీతత్వం పెరుగుతుంది
సాక్షి స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పరీక్ష రాయడం ద్వారా విద్యార్థుల్లో పోటీ తత్వం పెరుగుతుంది. భవిష్యత్‌లో కాంపిటేట్ పరీక్షలు రాసేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయి. స్పెల్‌బీలో అనేక కొత్త ఇంగ్లిష్ పదాలు నేర్చుకుంటారు. విద్యార్థులు మొదటిసారి మా పాఠశాల నుంచి స్పెల్‌బీ, మ్యాథ్స్ బీ పరీక్ష రాశారు.
– మల్లెల శ్రావణి, ఎస్‌పీఆర్ గురుకుల్ స్కూల్ యాజమాన్యం, కోదాడ
ఉత్సాహంగా పాల్గొని పరీక్ష రాసిన విద్యార్థులు
జిల్లా కేంద్రంలోని జయ
పాఠశాలలో నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment