అరు్హలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
హుజూర్‌నగర్ (చింతలపాలెం) : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తుందని అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం చింతలపాలెం మండల కేంద్రంలో రూ.2.61కోట్లతో నూతనంగా నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయం, రూ.2.98కోట్లతో ఎంపీడీఓ కార్యాలయం, రూ.2.38కోట్లతో పోలీస్‌స్టేషన్ భవనాల నిర్మాణం, రూ.10కోట్లతో చేపట్టనున్న మేళ్లచెరువు – చింత్రియాల రోడ్డు పనులకు, రూ.10కోట్లతో చేపట్టనున్న కిష్టాపురం నుంచి పీఆర్ సిమెంట్ వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలలో ఆయన మాట్లాడారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో తన హయాంలో రోడ్లు, లిఫ్ట్‌లు మంజూరు చేయించానని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని లిఫ్ట్‌లను వినియోగంలోకి తేచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. తొలుత చింతలపాలెంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి ఉత్తమ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రిని పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమాలలో కలెక్టర్ తేజస్‌నందలలాల్ పవార్, అదనపు ఎస్పీ నాగేశ్వరావు, ఆర్డీఓ శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి, ఈఈ సీతారాం, డీఈ పవన్‌కుమార్, ఏఈ సతీష్‌కుమార్, తహసీల్దార్ సురేందర్‌రెడ్డి, ఎంిపీడీఓ భూపాల్‌రెడ్డి, ఆర్‌ఐ వాసుదేవరావు, నాయకులు నరాల కొండారెడ్డి, నందిరెడ్డి ఇంద్రారెడ్డి, సీతారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రాకు ముఖచిత్రంగా
మారనున్న మఠంపల్లి : మంత్రి
మఠంపల్లి : తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న మఠంపల్లి మండలానికి రూ.80కోట్లతో చేపట్టిన డబుల్‌రోడ్డు నిర్మాణంతో ముఖచిత్రం మారిపోనుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మండల కేంద్రంలో రూ.80కోట్లతో చేపట్టనున్న హుజూర్‌నగర్–మట్టపల్లి డబుల్‌రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించానన్నారు. ముఖ్యంగా వేలాది ఎకరాల భూములకు సాగునీరందించేందుకు ఎత్తిపోతల పథకాలు నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment