ఫ ఆపరేషన్ చేయించుకున్నవారికి భోజన, రవాణా వసతి
ఫ లయన్స్ కంటి ఆస్పత్రి చైర్మన్ దోసపాటి గోపాల్
సూర్యాపేట: సూర్యాపేట లయన్స్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో 2024– 25 సంవత్సరానికి గాను 5 వేల మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంటి ఆస్పత్రి చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అందరికీ కంటి చూపు అందించాలనే సదాశయంతో ప్రత్యేకంగా సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కనీసం 2వేల శస్త్ర చికిత్సలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అంధత్వ నివారణలో భాగంగా అవసరం ఉన్న వారికి కంటి ఆపరేషన్ చేయిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉచిత కాటరాక్ట్ శస్త్ర చికిత్స చేయించుకున్నవారికి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న వారికి అల్పాహారం, భోజనం, డిన్నర్ వసతి కూడా ఉన్నట్లు వివరించారు. ఉచితంగా మధుమేహ పరీక్షలు నిర్వహిస్తామని, ఎలాంటి కన్సల్టేషన్ ఫీజు కూడా ఉండదని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment