మేళ్లచెరువు : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అఽథారిటీ సెక్రటరీ, సూర్యాపేట సీనియర్ సివిల్ జడ్జి శ్రీవాణి పేర్కొన్నారు. సోమవారం మేళ్లచెరువు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. విద్యార్థులు సరైన మార్గంలో నడిచి తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే డిస్ట్రిక్ట్‌లీగల్ సర్వీస్ అథారిటీ టోల్‌ఫ్రీ నంబర్ 15100 ను సంప్రదించాలన్నారు.
శివాలయంలో ప్రత్యేక పూజలు
మేళ్లచెరువులోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అఽథారిటీ సెక్రటరీ శ్రీవాణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు అందించారు. ఆయా కార్యక్రమాల్లో కోదాడ రూరల్ సీఐ రజితరెడ్డి, ఎస్‌ఐ పరమేష్, న్యాయవాదులు సుదర్శన్‌రెడ్డి, మల్లయ్య, వెంకటరత్నం, ప్రవీణ్, రాఘవరావు, నగేష్‌రాథోడ్, నవీన్ , మండల విద్యాధికారి వెంకటరెడ్డి ,ఉపాధ్యాయులు నారపరెడ్డి, ప్రసన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment