అభ్యసన సామర్థ్యాలు గుర్తించేలా..
చిలుకూరు: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్న నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్)కు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు వచ్చేనెల 4న జాతీయ స్థాయిలో నిర్వహించే అసెస్‌మెంట్ పరీక్షకు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) సెప్టెంబర్, అక్టోబర్‌తోపాటు ఈ నెలలో మూడు నమూనా పరీక్షలు నిర్వహించింది.
ఒకేసారి మూడు తరగతులకు..
జిల్లాల వారీగా ఎంపిక చేసిన పాఠశాలల్లో కేవలం 3, 6, 9వ తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, సైన్స్, సాంఘిక శాస్త్రం, గణితం సజెక్టుల్లో ఒకేసారి దేశ వ్యాప్తంగా డిసెంబర్ 4న పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష బహుళైచ్చిక (మల్టిపుల్ చాయిస్) విధానంలో ఉంటుంది. విద్యార్థులను పరీక్షకు ఎలా తయారు చేయాలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం జిల్లా విద్యాధికారి, జిల్లా స్థాయి అధికారులు అకడమిక్ అధికారులు న్యాస్ పరీక్షపై రోజు వారీగా పాఠశాలలను సందర్శించి విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు.
101 స్కూళ్లు.. 3,900 మంది విద్యార్థులు
వచ్చేనెల 4న నిర్వహించే న్యాస్ పరీక్షకు జిల్లాలో 101 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి మొత్తం 3,900 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. కాగా ఈ పరీక్ష జిల్లాలోని 688 ప్రాథమిక, ప్రాధమికోన్నత, 182 జిల్లా పరిషత్, మోడల్, గురుకుల పాఠశాలల్లో ఏ పాఠశాలలో నిర్వహిస్తారో పరీక్ష రోజు వరకు కూడా రహస్యంగానే ఉంచుతారని తెలిసింది. పరీక్ష నిర్వహించే మూడు తరగతులకు పేపర్లు వేరువేరుగా ఉంటాయి. పరీక్ష పేపర్ కూడా వివిధ కోడింగ్‌ల్లో ఏ, బీ, సీ, డీగా విభజించి ఉంటుంది.
ఫ 3, 6, 9 తరగతుల విద్యార్థులకు డిసెంబర్ 4న అచీవ్‌మెంట్ పరీక్ష
ఫ జాతీయ స్థాయిలో నిర్వహణకు ఎన్‌సీఈఆర్‌టీ సన్నాహాలు
ఫ ఇప్పటికే మోడల్ టెస్టులు
పూర్తి
ఫ పరీక్షకు సిద్ధమవుతున్న 3,900
మంది విద్యార్థులు
పరీక్షకు ఎంపికై న విద్యార్థులు ఇలా..
తరగతి పాఠశాలలు విద్యార్థులు
3వ 36 1,900
6వ 30 900
9వ 35 1,100
Comments
Please login to add a commentAdd a comment