డేటా ఎంట్రీ వేగవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట): సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వే, డేటా ఎంట్రీ, ధాన్యం కొనుగోళ్లు, పంచాయతీ రాజ్ పనులు తదితర అంశాలపై సోమవారం వెబెక్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. సర్వే 100 శాతం పూర్తి చేయని మండలాలు, మున్సిపాలిటీల అధికారులతో కారణాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనుల వివరాలను పంచాయతీ ఇంజనీరింగ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఎన్యుమరేటర్లు తప్పనిసరిగా దగ్గర ఉండి నమోదు చేయించాలన్నారు. డేటా ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి కుటుంబ వివరాలను క్షుణ్ణంగా ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోళ్లు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు, డీఆర్‌డీఓ వివి అప్పారావు, డీఎస్‌ఓ రాజేశ్వరరావు, డీపీఓ నారాయణరెడ్డి పాల్గొన్నారు.
సకాలంలో అర్జీలు పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో మొత్తం 34 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో కొన్నింటిని సత్వరమే పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment