చలికి గజగజ
జాగ్రత్తలు తీసుకోవాలి
చలికాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్న పిల్లల వైద్యుడు ఎస్.రుఫస్ రాజ్‌కుమార్ సూచించారు. చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవా లో ఆయన వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
● చలి కాలంలో ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు రెండు, మూడు నెలల పాటు ఇంట్లోనే ఉండడం మంచిది. బయటికి వెళ్తే అనారోగ్యం పాలుకావల్సివస్తుంది.
● చలికాలంలో ఉదయం 8గంటలకు ముందు, సాయంత్రం 6గంటల తర్వాత పిల్ల లను బయట తిప్పకూడదు.
● ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. తల, చెవులు, చేతులు, కాళ్లకు గాలి తగలకుండా కప్పి తీసుకెళ్లాలి.
● ప్రతిరోజు స్నానం చేయించిన తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ రాయాలి.
● ఇంట్లో పెద్దవాళ్లకు దగ్గు, జలుబు ఉంటే చిన్నపిల్లలకు దూరంగా ఉండాలి. లేకపోతే మాస్క్ ధరించాలి.
● దగ్గు, జలుబుతో పాటు జ్వరం వస్తూ రెండురోజులకు మించితే దగ్గర్లోని పిల్లల డాక్టర్‌ను సంప్రదించాలి.
● ఆస్తమా ఉన్న పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. కూల్‌డ్రింక్స్, స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాలి.
భానుపురి (సూర్యాపేట) : చలితో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. పది రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత చలి తీవ్రమవుతోంది. పగటి పూట చల్లటి చలిగాలులు వీస్తున్నాయి. సోమవారం జిల్లాలో 16 డిగ్రీల కనిష్ట, 28 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రివేళ బయటికి వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు.
గతానికి భిన్నంగా..
జిల్లాలో సాధారణంగా డిసెంబర్, జనవరి మాసాల్లో అధికంగా చలి ఉంటుంది. గతేడాది ఇదే మాదిరిగానే జిల్లాలో డిసెంబర్ 3వ తేదీ నుంచి వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు సైతం నమోదయ్యాయి. అదే నవంబర్ చివరి వారంలోనూ 20 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కానీ ఈ ఏడాది గతానికి భిన్నంగా సీజన్ ప్రారంభంలోనే చలి తీవ్రత పెరిగింది. ఈనెల 16నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తుండగా.. వారం రోజులుగా కనిష్ట స్థాయికి చేరాయి. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు చలికి వణుకుతున్నారు. ఉదయం వేళల్లో పనులకు వెళ్లే వారుఇబ్బంది పడుతున్నారు.
పెరుగుతున్న చలి తీవ్రత
జిల్లాలో పది రోజుల్లోనే చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఈనెల 16వ తేదీన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉండగా.. 17వ తేదీ నాటికి గరిష్టం రెండు డిగ్రీలు, కనిష్టం ఒక డిగ్రీ తగ్గింది. 20న అత్యల్పంగా 15 డిగ్రీల కనిష్ట్ట ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రోజులుగా కూడా 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
వారం రోజులుగా పెరుగుతున్న చలి
కనిష్టస్థాయికి ఉష్ణోగ్రతలు
రాత్రి వేళ బయటికి వెళ్లేందుకు జంకుతున్న జనం
చలిగాలులతో అప్రమత్తంగా
ఉండాలంటున్న వైద్యులు
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు
(డిగ్రీల సెల్సియస్)
తేదీ గరిష్టం కనిష్టం
18 30 18
19 29 16
20 29 15
21 29 16
22 30 16
23 29 15
24 29 15
25 29 16
Comments
Please login to add a commentAdd a comment