బహిరంగ చర్చకు రావాలి
సూర్యాపేట : మాలలు ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో బహిరంగ చర్చకు రావాలని టీ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు తప్పెట్ల శ్రీరాములు మాదిగ కోరారు. సోమవారం సూర్యాపేటలోని టీఎమ్మార్పీఎస్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ ఫలాలు పేద బడుగు బలహీన వర్గాలందరికీ అందాలన్నదే అంబేద్కర్ ఆశయమని, దానికి తూట్లు పొడిచేలా మాలలు వ్యవహరించడం సరికాదన్నారు. ఎస్సీలలో 59 ఉపకులాలు ఉంటే వారికి రిజర్వేషన్లు అందడం లేదని, అందుకే వారంతా ఎస్సీ వర్గీకరణ కోరుతున్నారని తెలిపారు. మాదిగలు ఎవరికి వ్యతిరేకం కాదని, వ్యక్తిగత కక్షలతో మాలలు వ్యవహరించి ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడడం సరికాదన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగడుపుల సూరయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు జానయ్య, జిల్లా అధ్యక్షుడు పుట్టల శ్రావణ్ కుమార్, బొడ్డు సైదమ్మ, పిడమర్తి మధు, మీసాల శివరామకృష్ణ, బొడ్డు మల్సూర్, బొల్లె అశోక్, సూరారపు నాగయ్య, గౌతం, సాయిరామ్ పాల్గొన్నారు.
సీపీఎం మహా సభలను జయప్రదం చేయాలి
మునగాల: ఈనెల 29,30, డిసెంబర్1 తేదీల్లో సూర్యాపేటలో ర్వహించే సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మునగాలలోని సీపీఎం కార్యాలయంలో చందా చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాసభల్లో భాగంగా 29న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోఅధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు దేవరం వెంకటరెడ్డి, శ్రీకాంత్‌వర్మ, మండల పార్టీ కార్యదర్శి బుర్రి శ్రీరాములు, జూలకంటి విజయలక్ష్మి, దేశిరెడ్డి జ్యోతి, మండవ వెంకటాద్రి, బచ్చలకూర స్వరాజ్యం, షేక్ సైదా, కుంభజడ వెంకటకోటమ్మ, మామిడి గోపయ్య, గోపిరెడ్డి మల్లారెడ్డి, రేఖ లింగయ్య, నందిగామ సైదులు, సుంకర పిచ్చయ్య, మల్లారెడ్డి పాల్గొన్నారు.
శివకేశవులకు
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : శివకేశవులకు నిలయమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నిత్య పూజలు కొనసాగాయి. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో పాటు కార్తీకమాసం చివరి వారం కావడంతో యాదగిరి కొండపై ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో రుద్రాభిషేకం, బిల్వార్చన చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీపత్రాలతో అర్చన చేశారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపం, ముఖ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్యకల్యాణం, జోడు సేవత్సం తదితర పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment