అప్పుడే రాశా.. ప్రేమలేఖ | - | Sakshi
Sakshi News home page

అప్పుడే రాశా.. ప్రేమలేఖ

Published Tue, May 16 2023 5:34 AM | Last Updated on Tue, May 16 2023 5:34 AM

- - Sakshi

తమిళ సినిమా: నటి సాయి పల్లవి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒక నిర్ధిష్టమైన నిర్ణయంతో కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారామె. ముఖ్యంగా గ్లామర్‌కు దూరంగా, నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలనే ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈమె డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయిన విషయం తెలిసిందే. ఈమెలో మంచి డ్యాన్సర్‌ ఉన్నారు కూడా. ప్రేమలో పడని వారు కళాకారులు కాలేరు అని ఇటీవల సీనియర్‌ దర్శకుడు భారతి రాజా కూడా పేర్కొన్నారు. అలాంటి అనుభవం నటి సాయి పల్లవి జీవితంలో కూడా జరిగిందట ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇందులో తాను ఏడవ తరగతి చదువుతున్నప్పుడే తన సహా విద్యార్థిపై ఇష్టం ఏర్పడిందన్నారు. అదంటే ఏదో తెలియని ఆసక్తి కలిగిందన్నారు. ఆ విషయాన్ని అతనికి తెలియజేయడం కోసం ప్రేమలేఖను రాశానన్నారు. అయితే దాన్ని అతనికి ఎలా అందజేయాలో తెలియక పుస్తకంలో పెట్టానన్నారు. అయితే ఆ ప్రేమ లేఖ తన తల్లి కంట పడడంతో బాగా కొట్టినట్లు వాపోయారు. అలా అమ్మ తనను కొట్టడం అదే మొదటిసారి, చివరి కూడా అని పేర్కొన్నారు. అప్పటి నుంచి అమ్మకు కోపం వచ్చేది ఏ పనీ చేయలేదని చెప్పారు. పిల్లల్ని మంచి మార్గంలో నడిపించే ప్రతి తల్లీ తన పిల్లలకు హీరోయిన్‌నే అని సాయిపల్లవి పేర్కొన్నారు.

నటి సాయి పల్లవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement