ట్రాఫిక్‌.. ట్రాఫిక్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌.. ట్రాఫిక్‌

Published Fri, Jan 19 2024 1:42 AM | Last Updated on Fri, Jan 19 2024 1:42 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: సంక్రాంతి వేడుకలు ముగియడంతో.. స్వస్థలాల నుంచి జనం చైన్నె వైపుగా తిరుగు ప్రయాణమయ్యారు. ఫలితంగా బుధవారం అర్ధరాత్రి నుంచే జాతీయ రహదారి, రాష్ట్ర రహదారుల్లోని టోల్‌గేట్ల వద్ద కిలో మీటర్ల కొద్ది వాహనాలు బారులుదీరాయి. ఇక గురువారం ఉదయం నుంచే చైన్నె శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. వివరాలు.. చైన్నెలో ఉద్యోగాలు, వివిధ పనులు నిమిత్తం నివాసం ఉంటున్న వారు, చదువుకుంటున్న విద్యార్థులు సంక్రాంతిని తమ కుటుంబాలతో జరుపు కోవడం కోసం స్వగ్రామాలకు వెళ్లిన విషయం తెలిసిందే. వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో పండుగను ఇంటిళ్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. సెలవులు ముగియడంతో గురువారం విధులకు హాజరయ్యేందుకు జనం పరుగులు తీశారు. దక్షిణ తమిళనాడు, పశ్చిమ తమిళనాడు జిల్లాలు, నగరాల నుంచి చైన్నె వైపుగా భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులు కదిలాయి. ఇక సొంత కార్లు, ద్విచక్ర వాహనాలలో చైన్నె వైపుగా లక్షలాది మంది బయలుదేరారు. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచే రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. ఫలితంగా దక్షిణ తమిళనాడు నుంచి వచ్చిన వాహనాలను అధికారులు కిలాంబాక్కం వరకే పరిమితం చేశారు. ఆమ్నీ ప్రైవేటు బస్సులను వండలూరు నుంచి ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా దారి మళ్లించారు.

కిలోమీటర్ల కొద్ది..

తాంబరం బైపాస్‌రోడ్డు మీదుగా కోయంబేడుకు వెళ్లే వాహనాలు పెరుంగళత్తూరు, వండలూరు, గూడువాంజేరి వరకు కిలో మీటర్ల కొద్ది బారులుదీరాయి. ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు వాహనాలకు గంటల సమయం పట్టింది. దీంతో కొందరు ప్రయాణికులు సమీపంలోని వండలూరు, ఊరపాక్కం, గూడువాంజేరి రైల్వే స్టేషన్‌ను ఆశ్రయించి ఎలక్ట్రిక్‌ రైళ్ల ద్వారా గమ్య స్థానాలకు పరుగులు పెట్టారు. గురువారం నుంచే స్కూళ్లు సైతం ప్రారంభం కావడంతో పిల్లలను తరగతులకు సకాలంలో పంపించేందుకు శ్రమించారు. ట్రాఫిక్‌ కారణంగా తాంబరం – కోయంబేడు జీఎస్‌టీ రోడ్డు, గిండి – ప్యారిస్‌, అన్నాసాలై, మైలాపూర్‌, అడయా ర్‌ తదితర మార్గాల్లో వాహనాలు నత్తనడకన సా గాయి. కోయంబేడు బస్టాండ్‌, ఎగ్మూర్‌, సెంట్రల్‌ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి.

చైన్నె

శివార్లలో

బారులుదీరిన వాహనాలు

ట్రాఫిక్‌.. ట్రాఫిక్‌

స్వస్థలాల నుంచి చైన్నెకు తిరుగు ప్రయాణమైన జనం

టోల్‌ గేట్ల వద్ద బారులుదీరినవాహనాలు

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement