తల్లిపేరుతో స్వచ్ఛంద సంస్థ | Sakshi
Sakshi News home page

తల్లిపేరుతో స్వచ్ఛంద సంస్థ

Published Tue, Apr 23 2024 8:30 AM

- - Sakshi

తమిళసినిమా: నటుడుగానూ, నిర్మాతగానూ గుర్తింపు పొందిన ఉదయ, ఇంతకు ముందు దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నిర్వాహకుడిగానూ సేవలందించారు. కాగా తాజాగా ఆయన తన తల్లి వల్లియమ్మై అళగప్పన్‌ పేరుతో వైద్య సేవా ట్రస్ట్‌ను ప్రారంభించారు. సోమవారం నటుడు ఉదయ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నిరుపేద విద్యార్ధుల వైద్య సాయం కోసం ఈ స్వచ్ఛంద సేవా ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తాను ఇంతకు ముందే నటుడిగానూ, నడిగర్‌ సంఘం కార్యవర్గ సభ్యుడిగానూ పలువురు నిరు పేద విద్యార్ధులకు వివిధ కళాశాల సంస్థల ద్వారా విద్యా సేవలను అందించినట్లు గుర్తు చేశారు. కాగా తాజాగా తన దివంగత తల్లి వల్లియమ్మై అళగప్పన్‌ పేరుతో ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ట్రస్ట్‌ ద్వారా ఉన్నత విద్యను చదువుకోవాలని ఆశ ఉన్నా, ఆర్థిక సమస్యల కారణంగా చదువును కొనసాగించలేని అర్హులైన నిరుపేద విద్యారు్థులు, తల్లిదండ్రులు లేని విద్యార్ధులకు విద్యాసాయం చేయనున్నట్లు చెప్పారు.

నటుడు ఉదయ

Advertisement
Advertisement