క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Fri, Oct 11 2024 1:26 AM | Last Updated on Fri, Oct 11 2024 1:26 AM

క్లుప్తంగా

50 వీధి కుక్కలు మృతి

తిరువళ్లూరు: తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధిలోని జయానగర్‌, కామాక్షినగర్‌, ఏఎస్‌పీ నగర్‌, సెంథిల్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో గత వారం రోజుల వ్యవఽధిలో సుమారు 50 వీధికుక్కలు అనుమానస్పదంగా మృతి చెందాయి. ఈ సంఘటన స్థానికంగా వివాదం చెలరేగింది. మృతి చెందిన కుక్కలను మున్సిపాలిటీ అధికారులు సమీపంలోని ప్రాంతంలో పూడ్చివేశారు. ఈక్రమంలో సంబంధిత ప్రాంతంలోని సీసీ కెమరాలను పోలీసులు పరిశీలించారు. 13వ వార్డుకు చెందిన బీఎస్పీ నేత వెట్రివేందన్‌ కుక్కలకు విషం కలిపిన ఆహారం పెట్టడం వల్లే కుక్కలు మృతి చెందిందన్న విషయాన్ని గుర్తించిన టౌన్‌ పోలీసులు అతడి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా మృతి చెందిన కుక్కలకు పశువైద్యులు డాక్టర్‌లు ఉమా, డాక్టర్‌ విశ్వేందన్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం కుక్కలను బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. వాటి అవయవాలను ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు.

సెయింట్‌ థామస్‌ మౌంట్‌లో ట్రాఫిక్‌ మార్పులు

కొరుక్కుపేట: చైన్నె సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రోడ్‌ ఆర్మీ రోడ్‌ జంక్షన్‌ నుంచి కత్తిపార ఫ్‌లైఓవర్‌ వరకు మెట్రో రైలు పనులు జరుగుతున్నాయి. ఈ పని కోసం శుక్రవారం (11వ తేదీ) నుంచి 14వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టనున్నారు. ఈ మేరకు చైన్నె ట్రాఫిక్‌ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో పేర్కొన్న మేరకు.. కత్తిపార ఫ్లై ఓవర్‌ నుంచి పోరూర్‌ వరకు ట్రాఫిక్‌లో ఎలాంటి మార్పు లేదు, పోరూర్‌ నుంచి కత్తిపార ఫ్లైఓవర్‌ వైపు వచ్చే వాహనాలు బెల్‌ ఆర్మీ రోడ్డు జంక్షన్‌ నుంచి నేరుగా వెళ్లడాన్ని నిషేధించారు. సెయింట్‌ థామస్‌ మౌంట్‌, పూందమల్లి రోడ్‌ – బెల్‌ ఆర్మీ రోడ్‌ జంక్షన్‌ నుండి కొత్తగా వేసిన రోడ్డు మీదుగా డిఫెన్స్‌ కాలనీ 1వ అవెన్యూ వద్ద కుడి మలుపు తీసుకుని సెయింట్‌ థామస్‌ హాస్పిటల్‌ మీదుగా బట్‌ రోడ్‌ చేరుకోవాలి. ఇతర కంటోన్మెంట్‌ వాహనాలు మౌంట్‌ రోడ్డులో ఎడమవైపునకు సుందర్‌ నగర్‌ 7వ క్రాస్‌ స్ట్రీట్‌, ధనకోటి రాజా వీధికి వెళ్తాయి. సిట్కో ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ సదరన్‌ సైడ్‌ రోడ్‌ నుండి ఒలింపియా వరకు 100 అడుగుల రోడ్డు జంక్షన్‌ చేరుకోవడానికి, కత్తిపారా చేరుకోవడానికి, వడపళని చేరుకోవడానికి ఎడమ వైపున కూడా వెళ్లవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement