ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు
పళ్లిపట్టు: దేవి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు చేస్తున్నారు. అలాగే ఇళ్లల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేసి మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 3న దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు సాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయాల్లో ప్రతిరోజూ విశేష పూజలు చేసి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో వాహన సేవల్లో కొలువుదీర్చి గ్రామ వీధుల్లో ఊరేగిస్తున్నారు. పళ్లిపట్టు గ్రామ దేవత కొళ్లాపురమ్మ ఏడో రోజైన బుధవారం రాత్రి సరస్వతీదేవి అలంకరణలో భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయ వీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. నొచ్చిలిలో ప్రసిద్ధి చెందిన గిరిరాజ కన్యకాపరమేశ్వరి సమేత గంగాధరేశ్వరర్ ఆలయంలో నవరాత్రి వేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి. రోజూ ప్రత్యేక వాహన సేవలో అమ్మవారు కొలువై గ్రామ వీధుల్లో ఊరేగుతున్నారు. శనివారంతో నవరాత్రి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment