క్లుప్తంగా
విధులు బహిష్కరించిన
వైద్యులు
తిరుత్తణి: చైన్నెలోని గిండి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడిపై కత్తితో దాడి సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు గురువారం విధులు బహిష్కరించారు. ఈ కారణంగా తిర్తుతణి లోని ప్రభుత్వాస్పత్రిలో ఓపీ, ఇన్ పేషెంట్ల విభాగాల్లో వైద్యసేవలు అందించేందుకు వై ద్యులతోపాటు వైద్యసిబ్బంది అందుబాటు లో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ప డ్డారు. తిరుత్తణి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వై ద్యులు విధులను బహిష్కరించడంతో అత్యవసర విభాగంలో మాత్రం వైద్యులు విధులు నిర్వహించారు. ఓపీలో వైద్యసేవలు స్తంభించడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోగులు వేచిచూసి చికిత్స అందక వెనుదిరిగారు.
తిరువళ్లూరులో..
తిరువళ్లూరు: గిండి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్‌పై యువకుడు కత్తితో దాడి చేసిన సంఘటనను నిరసిస్తూ తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. తిరువళ్లూరులోని ప్రభుత్వ వైద్యశాల ఎదుట జరిగిన ఆందోళనకు సంఘం జిల్లా కార్యదర్శి నందకుమార్, జిల్లా అధ్యక్షుడు ప్రభుశంకర్ హాజరై ప్రసంగించారు. డాక్టర్ ప్రభుశంకర్ మాట్లాడుతూ గిండి ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్‌పై కత్తితో దాడి చేసిన సంఘటన హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ డాక్టర్‌లపై తరచూ దాడులు జరుగుతున్నా డాక్టర్‌ల భద్రతపై ప్రభుత్వం కఠిన చట్టాలను చేయడం లేదన్నా రు. ప్రభుత్వ డాక్టర్‌పై దాడికి దిగిన యువకుడిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో అదనపు పోలీసు బలగాలు, సెక్యూరిటీ పెంచాలని కోరారు. సంఘం నేతలు రత్నవేలుకుమరన్, మహిళా విభాగం కార్యదర్శి అనురత్న, కోఆర్డినేటర్ జగదీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment