వైద్యం వికటించి బాలింత మృతి
రాస్తారోకో చేస్తున్న బంధువులు
– బంధువుల రాస్తారోకో
వేలూరు: ప్రభుత్వాస్పత్రిలో వైద్యం వికటించి ఓ బాలింత మృతి చెందింది. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని దేవలాపురం గ్రామానికి చెందిన విజయ్ భార్య దుర్గాదేవి(26) ప్రైవేటు షూ కంపెనీలో పనిచేస్తుంది. ఈమె రెండు రోజుల క్రితం ఆంబూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం కోసం చేరింది. ఆ సమయంలో ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో నర్సులు చికిత్స అందించారు. దీంతో దుర్గాదేవి ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆమెను తిరుపత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆడ శిశువుకు జన్మించింది. అక్కడ నుంచి సేలం, ధర్మపురి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి దుర్గాదేవి మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఆంబూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు లేక నర్సులు చికిత్స చేయడంతోనే దుర్గాదేవి మృతి చెందిందని ఆరోపిస్తూ గురువారం ఉదయం ఆంబూరు– పేర్నంబట్టు రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆంబూరు పోలీసులు వెంటనే ఆందోళనకారుల వద్దకు చేరుకుని చర్చలు జరిపి, రాస్తారోకోను విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment