అపూర్వం.. ఈ స్నేహం! | - | Sakshi
Sakshi News home page

అపూర్వం.. ఈ స్నేహం!

Published Fri, Oct 11 2024 1:26 AM | Last Updated on Fri, Oct 11 2024 1:26 AM

అపూర్వం.. ఈ స్నేహం!

అపూర్వం.. ఈ స్నేహం!

వేలూరు: వేలూరు జిల్లా, కాట్పాడిలోని కాంగనెల్లూరు కిరుబానంద వారియార్‌ ప్రభుత్వ పాఠశాలలో 1990లో ఫ్లస్‌టు పూర్తి చేసిన విద్యార్థుల కలయిక కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఎం.మోహన్‌ అధ్యక్షత ఆధ్వర్యంలో హెచ్‌ఎం జయంతి పూంగొడి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము పురతి సంవత్సరం పాఠశాలకు గుర్తింపుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌ 24వ తేదీన రూ.1.5 లక్షలతో పాఠశాలలో తాగునీటి శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు, 1990లో విద్యా బోధన చేసిన టీచర్లను ఆహ్వానించి సత్కరించడం, నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సహాయం, పాఠశాల కట్టడాలకు నిధులు సేకరించడం, విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు కల్పించడం వంటి తీర్మాణాలు చేశారు. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు వనతి, నెడుమారన్‌, శశికుమార్‌, వెంకటేశన్‌, దండపాణి, సుందర్‌రాజన్‌, గాంధీమది, జయశీలన్‌ వత్సలాదేవి, శాంతి తదితరులు పాల్గొన్నారు. 34 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థులు మొట్టమొదటి సారిగా ఒకేచోట కలుసుకోవడంతో ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని సంతోషం పంచుకున్నారు.

34 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల కలయిక

పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement